'రాహుల్ పై షీలా దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు Rahul Gandhi still not mature, please give him time: Sheila Dikshit

Rahul gandhi still not mature please give him time sheila dikshit

rahul gandhi, rahul gandhi uttar pradesh, uttar pradesh rahul gandhi, gandhi, congress samajwadi party, uttar pradesh polls 2017, up polls 2017, sheila dikshit, sheila dikshit congress, congress sheila dikshit, rahul gandhi mature,, Akhilesh Yadav, Dimple Yadav, Mulayam Singh Yadav, PM Narendra Modi, Congress, politics

Congress has been decimated in several states despite aggressive campaign by party vice-president Rahul Gandhi, former Delhi Chief Minister Sheila Dikshit has said that Rahul was still not mature and should be given (more) time”.

'రాహుల్ ఇంకా పిల్లవాడే': షీలా దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు

Posted: 02/24/2017 03:51 PM IST
Rahul gandhi still not mature please give him time sheila dikshit

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంకా పిల్లాడేనని అర్థ వచ్చేలా వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్. రాహుల్ గాంధీ ఎన్నికలు వున్న ప్రతీ రాష్ట్రంలోకి దూసుకెళ్లి.. అక్కడి బహిరంగ సభలు, ర్యాలీలతో ఉవ్వెత్తున్న ప్రచరం చేస్తున్నా.. దేశంలోని పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ తన ఉనికి చాటుకోలేక కేవలం ఒకటి రెండు స్థానాల్లోనే మనగలగడానికి గల కారణాలు ఏంటి అని మీడియా ప్రశ్నలు సంధించిన నేపథ్యంలో దీనిపై స్సందించిన అమె రాహుల్ కు 46 ఏళ్లు వచ్చినప్పటికీ... ఆయనలో ఇంకా పూర్తి పరిపక్వత రాలేదని చెప్పారు. పరిపక్వత వచ్చేందుకు ఆయనకు మరికొంత సమయం పడుతుందని తెలిపారు.

మరీ ముఖ్యంగా మారుతున్న తరం ఏం కోరుకుంటున్నారన్నది ఒకటైతే.. రాజకీయ నాయకులు బాషలో కూడా గత రెండుమూడేళ్లుగా మార్పులు వస్తున్నాయని, వాటిని మారుతున్న నేటి తరం యువకులు అస్వాధిస్తున్నారని, అమె అన్నారు. ఈ రెండింటినీ బేరిజు వేసుకుని రాజకీయ నాయకులు తమ రాజకీయ భాషలో మార్పులతో పాటు మారిన కాలనికి అనుగూణంగా మారాల్సిన తరుణం ఏర్పడిందన్నారు. అయితే, రాహుల్ తన మనస్సులో ఏది అనిపిస్తే అదే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారని ఇది చాలా వరకు మంచిదని అమె అన్నారు.

అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలా మభ్య పెట్టడం, కొత్త తరహాలో ప్రలోభాలకు గురిచేయడం, భ్రమలు కల్పించడం, మాటల్లో ఒకటి, ఆచరణలో మరోకటి పెట్టుకునే వ్యక్తి కాదని.. లేని విషయాన్ని సృష్టించుకుని మాట్లాడరని అన్నారు. రైతుల గురించి మాట్లాడింది రాహుల్ మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని షీలా దీక్షిత్ తెలిపారు. దశాబ్దాలుగా ఉన్న నాయకత్వ మార్పును ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రియాంకగాంధీ గొప్ప మేధావి అని... ఆమె వల్లే ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదిరిందని అన్నారు. రాహుల్, ప్రియాంకలు కలసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP polls 2017  sheila dikshit  Sonia gandhi  Rahul Gandhi  BJP. SP  Congress  

Other Articles