అసీస్ బౌలర్లను ఎదుర్కోలేక చాపచుట్టేసిన విరాట్ సేన.. India bowled out for 105 in first innings against australia in pune test

India bowled out for 105 in first innings in pune test against australia

india vs australia live score, ind vs aus live score, live cricket score, live score, cricket score, live score india vs australia, live score ind vs aus, india vs australia 2017 live, ind vs aus test live, india vs australia live, cricket live score, cricket live streaming, ind vs aus live online streaming, cricket news, cricket score, cricket

India have been bowled out for a poor 105, which means Australia now have a lead of 155 — which is more than handy.

అసీస్ బౌలర్లను ఎదుర్కోలేక చాపచుట్టేసిన విరాట్ సేన..

Posted: 02/24/2017 01:41 PM IST
India bowled out for 105 in first innings in pune test against australia

పూణే వేదికగా పర్యటక జట్టు అస్ట్రేలియాతో జరుగుతున్న తొలిటెస్టులో తొలిఇన్నింగ్స్ ను ప్రారంభించిన టీమిండియా అసీస్ బౌలర్ల ముంగిట మోకరిల్లింది. వరుసగా ఐదు సిరీస్ లు గెలిచిన విజయోత్సాహంతో ముందుకు కదులుతున్న టీమిండియాకు తొలిసారిగా కంగారెత్తించారు కంగారులు. టెస్టు మ్యచ్ లో కేవలం నలభై ఓవర్లు మాత్రమే ఆడిన విరాట్ సేన ఇక తమ వల్ల కాదంటూ ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా వెళ్లిపోదామని పూనుకున్నట్లు బ్యాట్స్ మెన్లు అందరూ ఒకరి తరువాత ఒకరు వరుసగా పెవీలియన్ బాట పట్టడంతో విరాట్ సేన కేవలం స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది.

జట్టులో కేఎల్ రాహుల్ అర్థశతకంతో రాణించినా.. మిగతావారందరూ మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కనీసం క్రీజ్లో నిలబడటానికి యత్నించకుండానే భారత ఆటగాళ్లు క్యూకట్టేశారు. శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ జట్టు.. టీ విరామానికి ముందుగానే ఆలౌట్ కావడం విమర్శలకు తావిస్తోంది. ఈ రోజు ఆటలో 40.1 ఓవర్లు ఆడిన భారత్ జట్టు 105 పరుగులకే చాప చుట్టేసింది. 94 పరుగుల వద్ద నాల్గో వికెట్ కోల్పోయిన భారత్.. మరో 11 పరుగుల వ్యవధిలో మిగతా వికెట్లను కోల్పోవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

ప్రధానంగా ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి భారత్ కు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ 33 ఓవర్ లో భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (64), రహానే(13),సాహా(0)లను ఓకీఫ్ పెవిలియన్ కు పంపాడు. ఆపై లయన్ బౌలింగ్ లో అశ్విన్(1)అవుట్ కావడంతో భారత్ వంద పరుగులలోపే ఏడో వికెట్ ను నష్టపోయింది. ఇక ఆపై తేరుకోలేని భారత్  మరో మూడు వికెట్లను కూడా వెంటనే కోల్పోయింది. చివరి మూడు వికెట్లను కూడా ఓకెఫీ సాధించడం విశేషం. ఓవరాల్ గా ఓకీఫ్ ఆరు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించగా, అతనికి జతగా స్టార్క్ రెండు, హజల్ వుడ్, లయన్ లు తలో వికెట్ తీశారు. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అసీస్కు 165 పరుగుల అధిక్యంలో వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ndia vs australia  team india  asutralia  virat kohli  kl rahul  pune test  cricket  

Other Articles