స్పైస్ జెట్ తో చౌకధర యుద్దానికి తెరలేపిన ఇండిగో After Spicejet, Indigo launches Rs 777 offer

After telecom space now airspace hots up as airliners get engaged in fare war

aviation industry, India-SpiceJet, Indigo, Air India, buy one fly two, non-metro cities, Jammu, Srinagar, Agartala, Guwahati, domestic aviation industry, world economic, Coalition of airline pilots associations, CAPA, OPEC

After SpiceJet on Wednesday announced flat fares of Rs 777 on the domestic sector to woo more flyers in the lean season, Indigo too came out with a similar offer.

స్పైస్ జెట్ తో చౌకధర యుద్దానికి తెరలేపిన ఇండిగో

Posted: 02/24/2017 10:45 AM IST
After telecom space now airspace hots up as airliners get engaged in fare war

టెలీకమ్యూనికేషన్ రంగంలో టెలికాం సంస్థల ద్వారా తీవ్రమైన పోటీ ఎదర్కోంటున్న వేళ.. రిలయన్స్ వచ్చి అన్యూకరమైన విలీనాలకు తెరతీయడం.. జియో పోటీని తట్టుకోవడానికి టెలికాం సంస్థలు కూడా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాయి. అయితే టెలికాం రంగం తరువాత అదే తరహా పోటీ ఇప్పుడు దేశీయ విమానయాన రంగంలోనూ నెలకొంది. సీటు కెపాసిటీని పెంచుకోవడంతో పాటు సంస్థలు లాభాలకు వెళ్లకుండా బ్రేక్ ఈవెన్ పాయింట్ కు కొద్దిగా లాభాలను మాత్రమే అలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాతో పాటు ప్రైవేటు విమాన సంస్థలు కూడా చౌకధరల యుద్దంలో జోరును ప్రదర్శిస్తున్నాయి.

తాజాగా, ఈ రాయితీ టిక్కెట్ల  వార్‌ లోకి దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా ఎంట్రీ ఇచ్చింది. సరిగ్గా స్పైస్ జెట్ లక్కీ సెవన్ ఆపర్ ను ప్రకటించిన తరువాత అదే తరహాలో ఇండిగో కూడా రాయితీ అఫర్ ను ప్రకటించింది. దేశీయ మార్గాల్లో తగ్గింపు ధరలను బుధవారం ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అన్నీ కలుపుకుని రూ.777రూపాయలకే టిక్కెట్లు ఆఫర్‌ చేస్తోంది. ఈ ఆఫర్ లో బుకింక్స్‌ ​ ఫిబ్రవరి 25 వరకు అందుబాటులోఉండనున్నట్టుతెలపింది. అలాగే ఈ టికెట్ల ద్వారా ఏప్రిల్‌ 27 వరకూ ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. సెలెక్టెడ్‌ సెక్టార్‌లో,  సెలెక్టెడ్‌ విమానాలకుమాత్రం ఈ ఆఫర్‌ పరిమితమని పేర్కొంది.

ఈ తగ్గింపు టికెట్ల ధరలు  అగర్తలా-గౌహతి,  శ్రీనగర-చండీఘఢ్‌ మధ్య  రూ.777 అందుబాటులో ఉండగా, చెన్నై-హైదరాబాద్‌ మధ్య రూ. 999గా ఉండనున్నాయి. ప్రయాణానికి 19రోజుల ముందుబుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.అలాగే పరిమితమైన సీట్లు అందుబాటులో ఉన్నాయనీ, ఒకవేళ క్యాన్సిల్‌ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే తిరిగి చెల్లించనున్నామని స్పష్టం చేసింది. మరిన్ని  వివరాలకు ఇండిగోఎయిర్‌లైన్స్‌ అధికారిక వెబ్‌ సైట్‌ ను సందర్శించగలరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SpiceJet  Indigo  domestic sector  Chennai-Hyderabad  Agartala-Guwahati  Srinagar-Chandigarh  

Other Articles