‘ఫీడం 251’ స్మార్ట్ ఫోన్ చైనా చీప్ ఫోన్లు.. ఓనర్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? | Police has detained Mohit Goel for Cheating Case.

Ringing bells director mohit goel arrested

Ringing Bells Director, Ringing Bells Mohit Goel, Mohit Goel Arrest, Freedom 251 Phone, Freedom 251 Scam, Freedom 251 Cheat, Ringing Bells Freedom 251, Freedom 251 Smart Phone

Ringing Bells Director Mohit Goel held for alleged Freedom 251 phone fraud. Pollice has detained Mohit, the company behind's last year Freedom 251 phone for alleged fraud. Goel was held after Ghaziabad-based Ayam Enterprises filed an FIR on Wednesday alleging that Ringing Bells "defrauded" it of Rs 16 lakh.

251 స్మార్ట్ ఫోన్ సూత్రధారి అరెస్ట్

Posted: 02/24/2017 08:15 AM IST
Ringing bells director mohit goel arrested

రూ.251కే స్మార్ట్‌ఫోన్ ఇస్తామంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రింగింగ్ బెల్స్ గుర్తుందా?. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపు మేరకు చీపుగా స్మార్ట్ ఫోన్ అందిస్తామని ప్రకటించి సంచలనం రేపింది. అయితే ఆర్డర్లు తీసుకుని ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా డెలివరీ చేయలేదు అనుకోండి. ఇక ఇప్పుడు ఈ కంపెనీ డైరెక్టర్ మోహిత్ గోయల్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఘజియాబాద్‌లోని ‘అయాం ఎంటర్‌ప్రైజెస్’ యజమాని మోహిత్ మోసం చేశాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది జరిగింది. ఫ్రీడం 251 ఫోన్... స్టోరీ ఫినిష్!

మొత్తం రూ.16 లక్షల మోసానికి పాల్పడినట్టు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం మోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ మనీష్ మిశ్రా తెలిపారు. ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసే బాధ్యతలు తీసుకోవాలంటూ నవంబరు 2015లో రింగింగ్ బెల్స్ ప్రతినిధులైన గోయల్ తదితరులు తనను కోరినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వివిధ సందర్భాల్లో రింగింగ్ బెల్స్‌కు రూ.30 లక్షలు చెల్లిస్తే తమకు మాత్రం రూ.13 లక్షల విలువైన ఉత్పత్తులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఆ తర్వాత తమ ఒత్తిడితో మరో లక్ష రూపాయల ఉత్పత్తులు ఇచ్చారని పేర్కొన్నారు.

మిగిలిన రూ.16 లక్షల గురించి ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు రీబ్రాండ్ చైనా ఫోన్ లను రింగింగ్ బెల్స్ ఆఫర్ లో ఇస్తున్నారని వాదించగా, అది శాంపిల్ కోసం తీసుకొచ్చామని రింగింగ్ బెల్స్ చెబుతోంది. దేశవ్యాప్తంగా ప్రకటనలతో ఊదరగొట్టిన రింగింగ్ బెల్స్ వెనుక పెద్ద స్కామే ఉందన్నది స్పష్టమౌతోంది. చూద్దాం మున్ముందు విచారణలో మరెన్ని విషయాలు బయటపడతాయో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ringing Bells  Freedom 251  Mohit Goel Arrest  

Other Articles