టోల్ గేట్ వద్ద ఘోరమైన యాక్సిడెంట్.. ఎక్కడ? | Man crushed to death at Nagrota Toll Plaza.

Terrible accident at ban toll plaza jammu

Toll Plaza Accident Video, Toll Plaza Jammu, Jammu Toll Plaza Video, Nagrota Toll Plaza Accident, Toll Plaza Truck Accident, Toll Plaza Supervisor Death, Terrible Toll Plaza Accident

Terrible Accident at Ban Toll Plaza Jammu, One Supervisor died on the spot.

ITEMVIDEOS:టోల్ ఫ్లాజా వద్ద ఘోరం

Posted: 02/23/2017 11:44 AM IST
Terrible accident at ban toll plaza jammu

ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం మరో ప్రాణం బలి తీసుకుంది. నార్ గొట్టా టోల్ ప్లాజా వద్ద దూసుకెళ్లిన ఓ ట్రక్కు ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్ లో వైరల్ అవుతోంది.

జమ్ము లోని బాన్ టోల్ ఫ్లాజా వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. వీడియోను పరిశీలిస్తే ఓ కారు వచ్చి టోల్ గేట్ రుసుము చెల్లించే క్రమంలో, వెనకాల ఇంకో కారు వచ్చి ఆగింది. ఆసమయంలో అక్కడ పని చేసే సెక్యూరిటీ సూపర్ వైజర్ సుర్జీత్ కుమార్ కార్ల మధ్యలోంచి అవతల వైపు వెళ్లే ప్రయత్నం చేశాడు.

 

ఇంతలో ఓ ట్రక్కు అతివేగంతో దూసుకొచ్చి అతన్ని, ముందు ఉన్న రెండు కార్లను ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా, కార్లలో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటన తర్వాత అక్కడి నుంచి జేకే02ఎం/3756 నంబర్ గల ఆ ట్రక్కు ఆగకుండా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ప్రమాదం పై పోలీసులు విచారణ చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu  Toll Plaza  Accident  

Other Articles