బ్లాక్ మనీ కాదు.. ఫేక్ నోట్లను కూడా ఆపలేకపోతున్నాడా? | Kejriwal slams Modi at Children Bank of India Notes.

Kejriwal slams modi on fake notes dispense

Fake 2000 Rs Notes, ATM Fake Notes, Delhi Chief Minister Aravind Kejriwal, Kejriwal and Modi, Modi on Fake Notes, 2000 Fake Notes, Children Bank of India, Black Money Fake Notes, Fake Notes Aravind Kejriwal, Kejriwal New Notes

Fake 2000 Rs Notes Dispensed at SBI ATM in Delhi Labeled Children Bank of India. Delhi Chief Minister Aravind Kejriwal slams at Modi.

కొత్త నోట్లు.. మోదీకి ఆ మాత్రం చాతకాదా?

Posted: 02/23/2017 09:46 AM IST
Kejriwal slams modi on fake notes dispense

నోట్ల రద్దు తర్వాత అవసరానికి మేర డబ్బులు లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ, ఆ తర్వాత నెమ్మదిగా కొత్త నోట్ల రాకతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. అదే సమయంలో కేవలం నల్ల డబ్బు నియంత్రణ, పైగా నకిలీ నోట్ల నిషేధం వంటి హామీలు నెరవేర్చే క్రమంలో కేంద్రం విఫలమవుతూనే వస్తోందన్న వాదన ఒకటి ఉంది. ఇది చాలదన్నట్లు కొత్త నోట్లలో నకిలీలు రావటం పెను కలకలమే రేపుతోంది.

ఢిల్లీలోని ఓ కాల్ సెంటర్ ఎంప్లాయ్ ఫిబ్రవరి 6న సంగం విహార్ లోని ఎస్ బీఐ ఏటీఎం నుంచి 8 వేలు డ్రా చేయగా, చిన్న పిల్లలు ఆడుకునే నోట్లు 4 వచ్చాయి. ఈ ఫేక్ నోట్ల వ్యవహారంపై తీవ్ర విమర్శలు రాగా, విచారణ జరుగుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇదిలా ఉంటే మీడియా కథనాల ఆధారంగా తన ఇలాకాలో జరిగిన ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నోట్లు సరిగా ముద్రించడం చేతకాని ప్రధాని మోదీ దేశాన్ని ఎలా నడపగలుగుతారని ప్రశ్నించాడు. నోట్ల రద్దుతో దేశాన్ని నవ్వుల పాలు చేశారని ఓ ట్వీట్‌లో ధ్వజమెత్తారు. నకిలీ నోట్ల అంతం చూసేందుకే పెద్ద నోట్లను రద్దు చేశామని చెప్పు కొచ్చిన మోదీ తాజా ఘటనపై ఏమని సమాధానం చెబుతారని కేజ్రీవాల్ ప్రశ్నించాడు. బుధవారం ఈ మేరకు తన ట్విట్టర్ లో క్రేజీవాల్ విమర్శలు గుప్పించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fake 2000 Notes  Delhi ATM  Aravind Kejriwal  PM Narendra Modi  

Other Articles