అమ్మాయిల నంబర్లు... ఇక సేఫ్ | Vodafone India offers woman friendly PRS.

Vodafone recharge without disclosing number

Private Recharge Mode service, Vodafone India, Vodafone India Without Disclosing Number, Recharge without Number, Private Recharge Services, Vodafone Woman Friendly Service, Indian Girl Mobile Number Recharge, Mobile Retailer Sold Numbers, Recharge outlets in UP

Vodafone India offers 'Private Recharge Mode' Without Disclosing Number. Introduced Private Recharge Mode services to ensure secrecy of mobile phone number of a user.

రీఛార్జీకి పోన్ నంబర్ అవసరం లేదు

Posted: 02/23/2017 08:59 AM IST
Vodafone recharge without disclosing number

ఆన్ లైన్ లోనే అన్ని వ్యవహరాలు చక్కదిద్దుకుంటున్న ఈ రోజుల్లో అంతగా పరిజ్నానం లేని కొందరు ఇంకా రీఛార్జీ షాపుల వద్ద క్యూలు కట్టడం చూస్తున్నాం. అయితే రిటైర్ల దగ్గర నంబర్ లు చెప్పిన సమయంలో వాటిని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఆ సమస్యలేం లేకుండా అంటే మొబైల్ నెంబ‌రు చెప్పకుండానే రీఛార్జీ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది వోడాఫోన్.

ఇందుకోసం చేయాల్సిందేంటటే... మీఫోన్ నుంచి 12604 నంబర్‌కు ‘Private’ అని ఓ సందేశం పంపాలి. వెంట‌నే మీ మొబైల్‌కి వన్‌ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీని మీ రీటైల‌ర్‌కి చెప్పి మీకు ఎంత కావాలో అంత రీఛార్జీ చేయించుకుంటే సరిపోతుంది. ఈ స‌ర్వీసు పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభం అయింది. స్మార్ట్ ఫోన్ల జమానాలో కస్టమర్లు ప్రైవసీ గురించే ప్రధానంగా ఆలోచిస్తున్నారు.. అందుకే ఈ ప్రైవేట్ రీఛార్జ్ సర్వీస్ ను ప్రారంభించామని వెస్ట్ బెంగాల్ సర్కిల్ హెడ్ అరవిందర్ సింగ్ సచ్ దేవ్ ప్రకటించాడు.

ఇక ఈ మధ్య ఉత్తరప్రదేశ్ లో రీఛార్జ్ షాపుకి వచ్చిన అమ్మాయిల ఫోన్ నంబర్లను 50 రూపాయ‌ల చొప్పున‌ అమ్మేస్తూ ఓ వ్య‌క్తి ప‌ట్టుబ‌డ్డ విష‌యం తెలిసిందే. త‌న వ‌ద్ద రీఛార్జ్ చేయించుకున్న అమ్మాయిల్లో కాస్త అందంగా ఉన్న అమ్మాయిల నంబ‌ర్ల‌ను ఇంకా ఎక్కువ రేటుకే అమ్మేశాడు. ఇలాంటి దందాలు ఎక్కువగా బయటపడుతుండటంతో ఈ విధానం చాలా వరకు మేలు చేస్తుందని వోడాఫోన్ ఇండియా చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles