అమ్మ మృతిలో చిన్నమ్మకు జీవిత శిక్ష? సెల్వం ఏం చేస్తాడో.. | Sasikala will get life term if probe takes place into Amma's death

Stalin holds sasikala responsible for jayalalithaa s death

Stalin Sasikala, Sasikala Natarajan Life Term Jail, Sasikala in Jail, AIADMK Protection Yatra, Panneerselvam Yatra, Jayalalithaa's Death, Sasikala Jayalalithaa Death, Stalin Protest, Stalin Floor Test

DMK Chief Stalin Comments on Sasikala Natarajan. She will get life term if probe takes place into Amma's death. AIADMK Protection Yatra by Panneerselvam soon.

అదే జరిగితే చిన్నమ్మకు జీవిత ఖైదు శిక్షే...

Posted: 02/23/2017 07:46 AM IST
Stalin holds sasikala responsible for jayalalithaa s death

బలనిరూపణ పరీక్ష నెగ్గినప్పటికీ తమిళనాడు సీఎంగా పళనిస్వామి ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ లు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓవైపు మాజీ సీఎం పన్నీర్ ప్రచార యాత్రకు సిద్ధమౌతుండటం, మరోవైపు ప్రతిపక్ష డీఎంకే అధినేత స్టాలిన్ వ్యవహారం పళనికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బుధవారం చెన్నైలో నిరాహారదీక్ష చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తే శశికళకు జీవిత ఖైదు ఖాయమని పేర్కొన్నాడు.

తాము ఆందోళనలు చేస్తున్నది తమకోసం కాదని ఆయన చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో కొలువుదీరిన బినామీ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా ఒక్క రోజు నిరాహారదీక్షలు చేపట్టామని ఆయన తెలిపారు. తన చొక్కా చింపి, తమను బలవంతంగా బయటకు పంపి ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై పోరాటంలో భాగమే ఈ నిరాహార దీక్ష అని ఆయన తెలిపారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో త‌మిళ‌నాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత దోషేన‌ని ఇటీవ‌లే సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మిళ‌నాడు స‌ర్కారు పథకాల్లో అమ్మ‌ పేరును తీసేయాలని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్. రాందాస్ కోరుతున్నాడు.

కావాలనుకుంటే త‌మ‌ పార్టీ కార్యక్రమాల్లో జ‌యలలితకు నివాళులు అర్పించుకోవచ్చని, అంతేగానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం కాదని రాందాస్ మండిప‌డ్డాడు. అమ్మ పేరుతో ఉన్న అన్ని ప‌థ‌కాల పేర్లు మార్చాల‌ని ఆయ‌న డిమాండ్ చేశాడు. ఈ అంశంపై గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌రావు స్పందించాల‌ని కోరాడు.

పన్నీర్ ప్రచార యాత్ర??

చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి అనంతర పరిణామాలతో ఒంటరైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. తనపై అనర్హత వేటు వేయాలన్న ఆలోచన చేస్తున్న పార్టీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహించేందుకు ప్రచార రథాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. మహీంద్ర జీపుకు చిన్నచిన్న మార్పులు చేయించి ప్రచార రథంగా తీర్చిదిద్దుతున్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్పీకరించిన పన్నీర్ సెల్వం ఆమె మరణంతో పూర్తిగా సమస్యల్లో చిక్కుకున్నారు. పార్టీ పగ్గాలు ‘చిన్నమ్మ’ చేతికి వెళ్లడంతోనే పన్నీర్‌కు సమస్యలు మొదలయ్యాయి. సీఎం పీఠం ఎక్కేందుకు ఉత్సాహం చూపిన శశికళ.. పన్నీర్‌తో బలవంతంగా రాజీనామా చేయించారు. దీంతో కలత చెందిన ఆయన శశికళపై తిరుగుబాటు చేశారు. అయితే ఎమ్మెల్యేలను పూర్తిగా తనవైపు తిప్పుకోవడంలో విఫలమైన పన్నీర్ చివరికి మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, శశికళ, ముఖ్యమంత్రి పళనిస్వామిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పన్నీర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే రథయాత్రకు సంబంధించిన తేదీలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

శశికళ చాటుమోహం..

అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో అన్నాడీఎంకే తాత్కాలిక‌ ప్రధాన కార్యదర్శి శశికళ న‌ట‌రాజ‌న్ జైలు శిక్ష అనుభ‌విస్తోన్న సంగ‌తి తెలిసిందే. జైలు నుంచే త‌మ‌ పార్టీ నేత‌లకు సూచ‌న‌లు పంపుతున్న ఆమె.. ఈ రోజు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి పళనిస్వామికి ఓ సందేశం పంపారు. తనని కలవడానికి ఎవ్వ‌రూ జైలుకు రావద్దని శశికళ ఆదేశించారు. శశికళ సోద‌రి కుమారుడు, అన్నాడీఎంకే డిప్యూటీ కార్యదర్శి దినకరన్ ఇటీవ‌ల శశికళను కలవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా, తనని కలవడానికి జైలుకి రావద్దని పళనిస్వామికి చెప్పాల్సిందిగా దినకరన్‌ తో చెప్పిందంట. త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చే బదులు చేయాల్సిన పనులపై దృష్టిపెట్టాలని చెప్పాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను క‌ల‌వాల‌నుకున్న సీఎం ప‌ళ‌నిస్వామి త‌న బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌‌ను వాయిదా వేసుకున్నాడు కూడా. కాగా, పార్టీ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర, సరస్వతిలతో పాటు ప‌లువురు నిన్న కలవడానికి బెంగళూరు జైలుకు వెళ్లగా వారితో మాట్లాడ‌డానికి శశికళ నిరాకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sasikala Natarajan  DMK Stalin  Jayalalithaa Death  

Other Articles