రాంజాస్ కాలేజీలో విద్యార్ధి సంఘాల ఘర్షణ.. Protests at Delhi's Ramjas College, students clash

Ramjas protest teachers students journalists beaten up in clash with abvp

Ramjas protest, ABVP clash, Student protest, JNU, Umar Khalid, Shehla Rashid, ABVP, Ramjas, DU -protest, Maurice Nagar Police station, DU ruckus

Clashes began as some DU students, led by members of AISA and SFI, took out a march on Wednesday demanding action against the ABVP members.

రాంజాస్ కాలేజీలో విద్యార్ధి సంఘాల ఘర్షణ..

Posted: 02/22/2017 08:55 PM IST
Ramjas protest teachers students journalists beaten up in clash with abvp

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంజాస్‌ కాలేజీ బుధవారం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. ఏబీవీపి, దాని వ్యతిరేక విద్యార్థి సంఘాలు పరస్పరం ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో అనేక మంది విద్యార్ధులతో పాటు అటు అద్యాపకులు, ఇటు జర్నలిస్టులతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. ఎవరు ఎవరితో ఘర్షణ పడుతున్నారన్న విషయం కూడా అర్థంకాకుండా పోయింది. దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్‌యూ విద్యార్థి ఉమర్‌ ఖలిద్‌ను రాజాంస్‌ కాలేజీలో ఓ సాహిత్య కార్యక్రమంలో ఉపన్యసించేందుకు ఆహ్వానించడంతో గొడవ ప్రారంభమైంది.

ఉమర్‌ ఖలీద్‌ రాకను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ విద్యార్థులు కాలేజీ ఎదుట ఆందోళన దిగారు. దేశద్రోహులకు ఆహ్వానాలు అందిస్తున్నారని ఆరోపిస్తూ కాలేజీపై దాడి చేశారు. దీంతో ఉమర్‌ ఖలీద్‌, షెహ్లా రషీద్‌ ఆహ్వానాలను కాలేజీ రద్దు చేసుకుంది. అయితే, ఏబీవీపీ ఉద్దేశపూరితంగా ఈ కార్యక్రమాలను రద్దు చేయించిందని, కాలేజీపై దాడి చేసిన ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని రాంజాస్‌, డీయూ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఏఐఎస్‌ఏ నేతృత్వంలో మౌలిస్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ వరకు ర్యాలీగా బయలుదేరారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramjas College  Ramjas protest  ABVP  Umar Khalid  DU protest  delhi  

Other Articles