అత్తాపూర్ ఫ్యాక్టరీలో మంటలు... ఆరుగురు కళ్ల ముందే బూడిదయ్యారు | Fire accident at attapur six died.

Fire accident in attapur six died

Attapur, Attapur Fire Accident, Cooler Godown Fire Accident, Hyderabad Fire Accident, 7 Killed Fire Accident, Bihar Workers Hyderabad Fire Accident, Rajendra Nagar Fire Accident

Fire Accident in Air Coolers Godown at Attapur, Hyderabad. Six Died.

ITEMVIDEOS:భారీ అగ్ని ప్రమాదం.. 6 గురి మృతి

Posted: 02/22/2017 08:16 AM IST
Fire accident in attapur six died

హైదరాబాద్ లో ఈ ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. రాజేంద్ర నగర్ అత్తాపూర్ లోని ఏవీ 1 ఎయిర్ కూలర్ గోడౌన్లో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పరిశ్రమలో ఏడుగురు కార్మికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఇక షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఈ దారుణం జరిగింది. చనిపోయిన వారంతా బీహార్ కు చెందిన కూలీలుగా గుర్తించారు. సద్ధాం, సాధు, ఇర్ఫాన్‌ ఖాన్‌, ఆయుబ్‌ ఖాన్‌లుగా నిర్ధారించారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. గోడౌన్ కు బయట వైపు తాళం వేసి ఉన్నా, దాని లోపల ఉన్న కార్మికులు మాత్రం రాత్రి సమయంలో పని చేస్తున్నారు. ఆ సమయంలోనే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

అయితే, ఈ సమాచారాన్ని యజమాని ప్రదీప్ కు కార్మికులు ఫోన్ చేసి చెప్పారు. తాళం లేదని ప్రదీప్ చెప్పడంతో కార్మికులు అక్కడి స్థానికులకు ఈ సమాచారం చెప్పారు. స్థానికులు దుకాణం షట్టర్ పగులగొట్టి లోపలికి వెళ్లే సరికే ఐదుగురు కార్మికులు కాలి బూడిదై పోయారు. ఫ్యాక్టరీ యజమాని ప్రమోద్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో మంటలు సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Attapur  Fire Accident  6 Died  

Other Articles