తమిళనాడు అసెంబ్లీలో మరో అవిశ్వాస తీర్మానం? పళనికి టెన్షన్.. | Madras HC on Palaniswamy floor test victory.

No confidence motion against tamil nadu speaker p dhanapal

No-Confidence Motion, Tamil Nadu Speaker Dhanpal, Tamil Nadu CM E Palaniswami, Palaniswami Madras High Court, Palaniswami DMK, No-Confidence Motion Dhanpal, DMK Speaker Dhanpal, P Dhanpal, Tamil Nadu Assembly Speaker, DMK Petition

DMK To Move No-Confidence Motion Against Tamil Nadu Assembly Speaker. Tamil Nadu CM E Palaniswami's trust vote challenged by DMK in High Court.

తమిళనాడులో మరో అవిశ్వాస తీర్మానం??

Posted: 02/21/2017 08:57 AM IST
No confidence motion against tamil nadu speaker p dhanapal

ఏకపక్షంగా వ్యవహరించి పళనిస్వామి ప్రభుత్వం నిలబడేందుకు సహకరించాడంటూ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధన్ పాల్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మరో విశ్వాస పరీక్షకు రంగం సిద్ధం కాబోతుంది. ప్రతిపక్ష డీఎంకే, పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా స్పీకర్ ధన్‌పాల్ వ్యవహరించిన తీరుపై గుర్రుగా ఉన్న డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఆయనపై విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు.

స్పీకర్ ధన్‌పాల్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, ఆయనపై అవిశ్వాస తీర్మానం తీసుకొస్తామని తెలిపారు. ధన్‌పాల్‌పై అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీకి చెందిన 34 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితే సరిపోతుందని అన్నారు. నిబంధనల ప్రకారం రెండు వారాల్లో సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాము కోరినట్టు రహస్య బ్యాలెట్ నిర్వహించి ఉంటే పళనిస్వామి సీఎం అయి ఉండేవారు కాదని చెబుతున్నాడు. ఇక మాజీ సీఎం జయలలిత మృతిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయకపోవడంతో తమ అనుమానాలు ఇంకా ఉన్నాయంటూ స్టాలిన్ వ్యాఖ్యానించాడు.

234 మంది ఉన్న తమిళనాడు అసెంబ్లీలో శనివారం నిర్వహించిన బలనిరూపణలో 122 అనుకూల ఓట్లతో పళనిస్వామి ప్రభుత్వం విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు రానుంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా నిర్వహించిన విశ్వాస పరీక్ష చెల్లదని పేర్కొంటూ, డీఎంకే మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విశ్వాసపరీక్ష చెల్లదంటూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ లో న్యాయస్థానాన్ని కోరింది.

ఓటింగ్ కంటే ముందు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సభ్యులను బలవంతంగా మార్షల్స్ చేత గెంటివేయించారని న్యాయస్థానం దృష్టికి డీఎంకే తెచ్చింది. తామంతా రహస్య ఓటింగ్ జరపాలని కోరినా పట్టించుకోలేదని చెబుతూ, ఈ వ్యాజ్యాన్ని అత్యవసర విచారణకు స్వీకరించాలని డీఎంకే తరఫున న్యాయవాది మద్రాసు హైకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ జి.రమేష్‌, జస్టిస్‌ మహదేవన్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారణకు స్వీకరించందని తెలుస్తోంది.

 

 

జల్లికట్టు తరహాలో మరో ఉద్యమం?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  Assembly Speaker  P Dhanpal  No-Confidence Motion  

Other Articles