నిరుద్యోగ నిరసన ర్యాలీ.. కోదండరాం సెల్ఫీష్ ర్యాలీ?? | Samajika Telangana JAC digged at Kodandaram's rally.

Kodandaram respond on nirudyoga rally permission denied

Nirudyoga Nirasana Rally, Telangana JAC, JAC chairman Kodandaram, Kodandaram Nirudyoga Nirasana Rally, Telangana Government Kodandaram, Telangana Nirudyoga Nirasana Rally, Unemployee youth Rally, High Court Kodandaram, Samajika Telangana JAC Kodandaram

Hyderabad HC suggests TJAC chief Kodandaram to postponee Nirudyoga Nirasana Rally.

కోదండరాం ఎటకారపు మాటలు విన్నారా?

Posted: 02/21/2017 08:27 AM IST
Kodandaram respond on nirudyoga rally permission denied

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ ర్యాలీకి, బహిరంగ సభకు అనుమ తినివ్వడం సాధ్యం కాదని పోలీసులు తేల్చి చెప్పారు. మరోవైపు హైకోర్టు కూడా అందుకు విముఖతతోనే ఉన్నట్లు సోమవారం జరిగిన వాదనలు వింటే అర్థమౌతోంది. మరోపక్క బుధవారం ఎలాగైనా జరిపి తీరాలని జేఏసీ మొండిపట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందన్న దానిపై కాస్త ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. ఇదిలా ఉంటే టీజేఏసీ గతంలో చేసిన ఉద్యమాలన్నీ హింసాత్మకంగా ఉన్నాయంటూ, ఆ సమయంలో పలువురు పోలీసులు గాయపడ్డారంటూ ప్రభుత్వం వాదనలు వినిపించటం కొసమెరుపుగా మారింది.

అనుమతి నిరాకరణపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్‌ వరకు తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ, ఆపై నిజాం కాలేజీ లో సభ నిర్వహణకు ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే సమస్య ఉందని తొలుత వాదించిన ఏజీ రామకృష్ణా రెడ్డి ఆఫై మాట మార్చాడు. ‘‘అసలు ఇవన్నీ కాదు.. సభలో తీవ్రవాద సంఘాలు కూడా పాల్గొనే అవకాశం ఉందని మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది’’ అంటూ బెంచ్ కి వివరించాడు. సభలో పాల్గొన్న వారు పక్కనున్న భవనాలపై రాళ్లేయవచ్చని, పరిస్థితులు అదుపు తప్పడానికి అదొక్కటి చాలన్నారు. 5 వేల మంది అని వారు చెబు తున్నారని, అయితే, 15 వేల నుంచి 20 వేల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తాము సూచించిన ప్రత్యామ్నాయ ప్రదే శాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయని తెలిపాడు. అయితే అది కేవలం ఆరోపణలే అంటూ జేఏసీ తరపు న్యాయవాది తోసిపుచ్చారు.

ఇక దీనిపై మంగళవారం కూడా దీనిపై వాదనలు జరగనున్నాయి. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిరుద్యోగుల నిరసన ర్యాలీని నిర్వహించుకోవాలన్న పోలీసుల ప్రతిపాదనపై టీజేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ‘‘ఇంకా నయం.. ఎవరెస్ట్ శిఖరం మీద చేసుకోమన్నారు కాదు’’ అని ధ్వజమెత్తారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఫలితం ఉండబోదన్నారు.

ర్యాలీని శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగానికి లోబడి నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ర్యాలీ పూర్తయ్యే వరకు నిద్రపోబోమని తేల్చి చెప్పారు. జేఏసీ ఆవిర్భావం తర్వాత ఎన్ని ఉద్యమాలు జరిగాయో, ఎలా జరిగాయో కూడా అందరికీ తెలిసిన విషయమేనని కోదండరాం పేర్కొన్నారు. అటువంటిది ఇప్పుడు ఊరిబయట ర్యాలీలు చేసుకోమనడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క కోదండరాం వ్యక్తిగత స్వార్థం కోసమే ఈ ర్యాలీ చేపట్టబోతున్నాడంటూ సామాజిక తెలంగాణ జేఏసీ ఆరోపించటం విశేషం.

సెలవు రోజు నిర్వహించుకోవచ్చు కదా?

శాంతిభద్రతల సమస్య ఉండటంతో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉందన్న ప్రభుత్వ వాదనకు స్పందించిన న్యాయమూర్తి ఆదివారం రోజున సభ నిర్వహిం చుకునేందుకు ఇబ్బంది ఏంటని టీజేఏసీ తరఫు న్యాయవాది రచనారెడ్డిని ప్రశ్నించారు. దీనిపై జేఏసీ చైర్మన్‌తో మాట్లాడి చెప్పాల్సి ఉందని ఆమె చెప్పడంతో, అయితే మంగళవా రం ఉదయం 10.30 గంటలకు కేసు విచారణ చేపడతామని, అప్పటికల్లా ఆదివారం సభ నిర్వహణపై స్పష్టతనివ్వాలని చెప్పారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వ రరావు ఉత్తర్వులు జారీ చేశారు.

తాము రోజంతా సభ నిర్వహించబోమని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలకల్లా సభను పూర్తి చేస్తామన్నారు. కోర్టు ఎలాంటి షరతులు విధించినా పాటిస్తామన్నారు. స్వామీజీలకు ఎల్‌బీ స్టేడియం ఇచ్చిన సర్కారు.. తమ సభకు మాత్రం అనుమతినివ్వకుండా రాజ్యాంగ హక్కులను హరిస్తోందని రచనారెడ్డి పేర్కొన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ... ఇలాంటి రెచ్చగొట్టే వాదనలు చేయవద్దని సున్నితంగా ఆమెకు సూచించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Professor Kodandaram  Telangana JAC  Nirudyoga Nirasana Rally  

Other Articles