అమితాబ్ గారు.. ‘గుజరాత్ గాడిదలకు’ ప్రచారం ఆపండి.. ప్లీజ్ Akilesh to Amithabh to Stop promoting Gujarat Donkeys.

Akhilesh yadav s dig at pm narendra modi

Gujarat Donkeys, Akhilesh Yadav PM Narendra Modi, Akilesh at Raibareli Meeting, Akilesh Amithabh Donkey Ad, Akilesh on Gadha ad, Stop endorsing donkeys, Amithabh Bachchan Gujarat Brand Ambassador, Endorsing Gujarat Donkeys

Akhilesh Yadav mocks PM Narendra Modi at Raibareli Meeting. Asks Amithabh Bachchan to don't promote Gujarat Donkeys.

మోదీపై డబుల్ మీనింగ్ డైలాగ్ ఏశాడు

Posted: 02/20/2017 04:17 PM IST
Akhilesh yadav s dig at pm narendra modi

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ యూపీ ఎన్నికల ప్రచార సభలో మరోసారి దేశ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసి మాటల తుటాలు పేల్చాడు. రాయ్ బరేలీలో జరిగిన ప్రచార సభలో ప్రసంగిస్తూ గుజరాత్ గాడిదలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ ఈ కామెంట్లు సలహా రూపంలో ఎవరికిచ్చాడో తెలుసా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కి.

అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం గుజరాత్ లో టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందుకోసం అటవీ గాడిదలతో ఈ మధ్యే రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఓ యాడ్ ను కూడా రూపొందించింది గుజరాత్ పర్యాటక శాఖ. అందులో అమితాబ్ నటించాడు కూడా. దీనిని ఉద్దేశించి అఖిలేష్ మోదీపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు.

ఈ శతాబ్దపు సూపర్ స్టార్ గా ఉన్న బిగ్ బీకి ఒక్కటే విజ్నప్తి. దయ చేసి మీరు గుజరాత్ గాడిదల కోసం ప్రచారం చేయటం ఆపేయండి అంటూ కోరాడు. దీంతో అఖిలేష్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. అన్నట్లు ఈ మధ్యే యూపీలో ఓ సభలో మోదీ మాట్లాడుతూ అఖిలేష్ యాదవ్ అడ్వర్టైజ్ ల పేరిట కోట్లాది ప్రజా ధనం వృథా చేస్తున్నాడని వ్యాఖ్యానించాడు. దీనికి కౌంటర్ గానే అఖిలేష్ తాజా వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  CM Akilesh Yadav  Gujarat Donkeys  PM Narendra Modi  Amithabh Bachchan  

Other Articles