పళనికి కొత్త షాక్.. జైలు నుంచే ఆర్డర్లు వేస్తుందంట ! Sasikala jail shift petition in SC.

Dmk file petition against palaniswamy trust vote

DMK Palaniswamy, Palaniswamy Madras HC, Trust Vote Madras High Court, Sasikala Karnataka to Tamil Nadu, Sasikala Supreme Court Petition, Sasikala Jail Shift

DMK moves HC against Palanisamy’s trust vote. Sasikala Natarajan Petition in Supre Court for Jail Shifting from Karnataka to Tamil Nadu.

హైకోర్టులో డీఎంకే.. శశికళ మాత్రం సుప్రీంలో...

Posted: 02/20/2017 01:44 PM IST
Dmk file petition against palaniswamy trust vote

తమిళనాడు అసెంబ్లీలో జరిగిన యాక్షన్ డ్రామాలో కొత్త ట్విస్ట్. ఎడప్పది పళనిస్వామి సీఎంగా బలనిరూపణలో గెలవటంపై అభ్యంతరాలు లేవనెత్తింది డీఎంకే. ఈ మేరకు తమ చొక్కాలు చించి దారుణ అవమానానికి గురి చేశారంటూ గగ్గోలు పెట్టిన ప్రతిపక్ష పార్టీ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది.

స్పీకర్ దనాపాల్ సభ హక్కులను మంటగలుపుతూ తమకు నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించివేసి బలపరీక్ష చేయటం దారుణమని, తాము సీక్రెట్ ఓటింగ్ కు పట్టుబట్టడంతో ఎక్కడ ఓడిపోతామోనన్న భయంతో పళనిస్వామి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టి అసెంబ్లీని రణరంగంగా మార్చాడంటూ ఆరోపించింది. సభ ప్రారంభమైన తర్వాత రెండు సార్లు వాయిదా వేసి, ఆపై తలుపులు మూసి చేయటంతో అనుమానాలు రెకెత్తుతున్నాయంటూ పిటిషన్ లో పేర్కొంది. మంగళవారం ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపటట్టనుండంతో ఏం జరగబోతుందా అన్న టెన్షన్ మరోసారి మొదలైంది.  

మరోవైపు అసెంబ్లీలో శనివారం జరిగిన ఘటనపై గవర్నర్ విద్యాసాగర్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఆయనకు స్పీకర్ పై ఫిర్యాదు అందగా, ఏం జరిగిందో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయానికి రాజ్ భవన్ ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క తాము అమ్మను చూసి ఓట్లు వేశామని, సీఎంగా పళనిస్వామి పనికి రాడంటూ గవర్నర్ కార్యాలయానికి విజ్నప్తులు అందుతున్నాయి. ప్రజాభీష్టం మేరకు నడుచుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ పేర్కొంటూ తక్షణమే పళని సర్కార్ ను రద్దు చేయాలంటూ అందులో కోరుతున్నారు.

పళని అసలు ఎలా గెలిచాడబ్బా?

 

సుప్రీంలో శశికళ కొత్త పిటిషన్..

ప్రభుత్వానికి తన మార్గదర్శకాలు అందించేందుకు అందుబాటులో ఉండాలని భావిస్తున్న వీకే శశికళ నటరాజన్ అందుకోసం కొత్త ప్యూహాన్ని రచిస్తోంది. ప్రస్తుతం కర్ణాటక జైల్లో ఉన్న ఆమె తనను తమిళనాడు జైలుకు తరలించాలని ఓ పిటిషన్ మద్రాస్ హైకోర్టులో వేయాలని భావించింది. అయితే హైకోర్టు కాకుండా నేరుగా సుప్రీంకోర్టులోనే వేస్తే ఫలితం ఉండొచ్చన్న భావనకు వచ్చిన ఆమె ఈ మేరకు తన వర్గీయులకు సూచించినట్లు సమాచారం. అనారోగ్యం, అభద్రత కారణాల దృష్ట్యా తనను వెలూరు జైలుకు మార్చాలని అందులో ఆమె కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మూడు రోజుల్లో ఆమె తరపు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటిదాకా ఆమె విషయంలో కాస్త కూడా సానుకూలత చూపని అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందోనన్న ఆసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DMK  Madras High Court  Trust Vote Petition  Sasikala  Jail Shift  

Other Articles