వాళ్లిద్దరూ యువతులే.. కానీ భార్యభర్తల్లా గుర్తించాలట.. girls approach police seeking protection from families

Mathura girls in love approach police seeking protection from families

same sex relationship, same sex marriage in India, Mathura girls in love, Mathura girls, Anora village, girls living together, Mathura

Two Mathura girls, who are in love and want to marry each other against their parents' wishes, have sought police protection for tying the knot and living together.

ఇదేం విచిత్రం: వాళ్లిద్దరూ యువతులే.. కానీ భార్యభర్తల్లా గుర్తించాలట..

Posted: 02/19/2017 10:39 AM IST
Mathura girls in love approach police seeking protection from families

వాళ్లిద్దరూ యువతులే.. అయితే వారికి వారి తల్లిదండ్రుల నుంచి ఓ సమస్య ఎదురైంది. వారు ఏకంగా పోలీసులను అశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. వారి సమస్య విన్న పోలీసులు ఔరా..? ఇదే విచిత్ర సమస్య వచ్చిపడిందిరా బాటు..? అంటూ తలబద్దలుకోట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని మధుర పోలీసులను ఆశ్రయించిన ఇద్దరు యువతులు తామిద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని అందుకు తమ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. తామిద్దరం దంపతుల్లాగా కలిసుంటామని అందుకు తమకు సహాయం చేయాలంటూ ఒక పెళ్లై భర్తతో విడిపోయిన యువతి, మరో విద్యార్థిని పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు.

తమ కోరిక నెరవేర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. దీంతో అప్పటికే వారిద్దరి విన్నపానికి ససేమిరా అంటూ చివాట్లు పెడుతున్న తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. మధురలోని రెండు పక్కపక్క గ్రామాలకు చెందిన వీరు ఒకే కులానికి చెందినవారు. తాము చాలా రోజులగా ప్రేమించుకుంటున్నామని, ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి తనను బాగా కొడుతున్నారని మీరా(పేరు మార్చాం) అనే ఆమె చెప్పింది. ఎలాగైనా తాము పెళ్లి చేసుకుంటామని, అందుకు తమకు సహాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. తల్లిదండ్రులు మాత్రం అందుకు నిరాకరించారు. దీంతో ఈ విషయంపై ఎలా ముందుకు వెళ్లాలని ఆ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles