విశ్వాసం నెగ్గిన పళనిస్వామీపై సెలబ్రిటీలు ఏమన్నారంటే.. cine celebrities tweets against palanisamy after winning trust vote

Cine celebrities tweets against palanisamy after winning trust vote

tamil nadu, palnisamy, paneer selvam, Dharma yudhdam, pandyarajan, cine celebrities, sasikala, chief minister, dhanpak, TN assembly speaker, vidyasagar rao, cabinet minister, stalin, dmk, aiadmk, congress, tamil nadu politics

Edappadi Palaniswamy, who was sworn-in as the Chief Minister of Tamil Nadu, won a ruckus-marred Trust vote in the Assembly, but celebrities tweeted against his victory

విశ్వాసం నెగ్గిన పళనిస్వామీపై సెలబ్రిటీలు ఏమన్నారంటే..

Posted: 02/18/2017 05:51 PM IST
Cine celebrities tweets against palanisamy after winning trust vote

తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న హైవోల్టెజ్‌ డ్రామా అనంతరం జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి విజయం సాధించారు కానీ తమిళ ప్రజల హృదయాలను గెలుచుకునేనా..? అంటే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అమ్మకు విధేయుడిగా వున్న పన్నీరు వైపు తమిళ ప్రజల సానుభూతి మాత్రం వుందన్నది కాదనలేని నిజం. తన పాలనలో అమ్మ పథకాలను కొనసాగిస్తానని, అమ్మ ఆశయాసాధన తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

అయితే ఇవాళ ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠకు తెరతీసీన తమిళనాడు అసెంబ్లీ పరిణామాలను ఉదయం నుంచి గమనించిన సినీ ప్రముఖులు పళనిస్వామి ఎన్నిక ప్రజాస్వామ విరుద్దంగా జరిగిందని ఘాటుగా ట్విట్టు చేశారు. తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ జరిగిన ఘటనలపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమల్‌ హాసన్‌ సహా రాధిక, ఖుష్బూ, అరవింద స్వామి తదితరులు తీవ్రంగా స్పందించారు. దీంతో నాలుగేళ్లు అధికార పీఠంపై వుండునున్మ పళనిస్వామి వారిని కూడా టార్గెట్ చేస్తారా..? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఇవాళ తన ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోని 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలాన్ని నిరూపించుకున్న నేపథ్యంలో అయనకు వ్యతిరేకంగా ట్విట్లు పోస్టు చేశారు. ఇంతకీ అవారేమన్నారో చూద్దామా..? కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్టే కనిపిస్తోంది. జై డె'మాక్‌'క్రేజీ అంటూ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంద'ని కమల్‌ హాసన్‌ ట్వీట్‌ చేశారు. గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు తమిళనాడు ప్రజలు సరైనరీతిలో స్వాగతం పలుకుతారంటూ హెచ్చరించారు.

సినీ నటి ఖుష్బూ స్పందిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే బలం, ప్రతిపక్ష సభ్యులు లేకుండా బలపరీక్ష నిర్వహించడమంటే ప్రజాస్వమ్యానికి అది విరుద్ధమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలు అవమానకరంగా ఉన్నాయని, గవర్నర్‌ రంగంలోకి దిగి చర్య తీసుకోవాలని సినీ రాధికా శరత్‌కుమార్ కోరారు. ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఈ బలపరీక్షను ఎవరూ అంగీకరించబోరని, ఎమ్మెల్యేలు కలువాల్సింది ప్రజలను కానీ, రిసార్టులో పార్టీ నేతలను కాదని సినీ నటుడు అరవింద స్వామి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు కవర్‌ చేయకుండా మీడియాను బ్లాక్‌ చేసి.. ఎంచుకున్న దృశ్యాలను మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles