పళనిస్వామి నెగ్గిన తరువాత పన్నీరు సెల్వం కామంట్..! Fight not over, only people will decide if trust vote was valid: OPS

Panneerselvam comment after palanisamy wins trust vote

tamil nadu, palnisamy, paneer selvam, Dharma yudhdam, pandyarajan, sasikala, chief minister, dhanpak, TN assembly speaker, vidyasagar rao, cabinet minister, stalin, dmk, aiadmk, congress, tamil nadu politics

Former Tamil Nadu Chief Minister O Panneerselvam expressed disappointment after Sasikala pick Edappadi Palanisamy won the vote of the confidence in the state Assembly

పళనిస్వామి నెగ్గిన తరువాత పన్నీరు సెల్వం కామంట్..!

Posted: 02/18/2017 04:29 PM IST
Panneerselvam comment after palanisamy wins trust vote

నాటకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష  ముగిసిన అనంతరం  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడారు.  అరాచకశక్తులు ఇపుడు విజయం సాధించినా తమ పోరాటం కొనసాగుతుందని  సెల్వం  స్పష్టం చేశారు. ధర్మాన్నీ, న్యాయాన్నీ ఖూనీ చేశారన్నారు. అమ్మ ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోరితే దాడిచేశారనీ, అన్యాయంగా కొట్టి, బలవంతంగా  సభనుంచి లాగి పడేశారని విమర్శించారు.  మాఫియా చర్యల్లో భాగంగా విశ్వాస పరీక్షను ముగించారని దుయ్యబట్టారు.

అసలైన యుద్ధం మొదలైందని పన్నీరువర్గం ప్రకటించింది.  డీఎంకే, కాంగ్రెస్‌,ఇ తరప్రతిపక్ష సభ్యులు లేకుండా ఓటింగ్‌ నిర్వహించడం అప్ర​జాస్వామికమని ఆరోపించింది. అసలైన ధర్మ యుద్ధం ఇపుడే మొదలైంది. తమపోరాటం  కొనసాగుతుందని పన్నీరు వర్గం  స్పష్టం చేసింది. కాగా మధ్యాహ్నం 3గంటలకు వాయిదా  తరువాత తిరిగి  ప్రారంభమైన అసెంబ్లీలో మూజువాణి  ఓటింగ్‌ను కొనసాగించిన స్పీకర్‌  సీఎం పళనిస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గినట్టు ప్రకటించారు. పళనికి మద్దతుగా 122, వ్యతిరేకంగా 11 ఓట్లు నమోదైనట్టు ప్రకటించారు.

సభలో సీక్రెట్ ఓటింగ్ జరిపి ఉంటే కచ్చితంగా తామే గెలిచేవాళ్లమని పన్నీర్ సెల్వం వర్గీయుడు కె.పాండ్యరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ధన్ పాల్ సీక్రెట్ ఓటింగ్ నిర్వహించక పోవడం వల్లనే పళనిస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గారని పన్నీర్ ఆయన అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకే తిరుగుబాబు ఎమ్మెల్యేలు నటరాజ్, సెమ్మలై, ఆరుకుట్టి, మనోహర్, మాణిక్యం, శరవణన్ విశ్వాసపరీక్షలో పళనికి వ్యతిరేకంగా ఓటేసినా ఫలితం లేకపోయింది. అయితే విశ్వాసపరీక్షను వ్యతిరేకిస్తూ పన్నీర్ వర్గీయులు కొందరు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఓటింగ్ లో పాల్గొన్న వారిలో ఆరుగురు పన్నీర్ మద్ధతుదారులు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamil nadu  palnisamy  paneer selvam  Dharma yudhdam  pandyarajan  stalin  dmk  aiadmk  congress  tamil nadu politics  

Other Articles