తమిళనాడులో మంటగలిసిన సభా గౌరవం.. స్పీకర్కు పరాభవం opposition Assults TN Speaker dhanpal in assembly

Opposition assults tn speaker dhanpal in assembly

tamil nadu, palnisamy, paneer selvam, sasikala, chief minister, dhanpak, TN assembly speaker, vidyasagar rao, cabinet minister, stalin, dmk, aiadmk, congress, tamil nadu politics

DMK members surround the Speaker's chair as the House reassembles. Security is struggling to evict DMK MLAs.

తమిళనాడులో మంటగలిసిన సభా గౌరవం.. స్పీకర్కు పరాభవం

Posted: 02/18/2017 01:21 PM IST
Opposition assults tn speaker dhanpal in assembly

తమిళనాడు అసెంబ్లీలో సభా గౌరవం మంటగలిసింది. విపక్ష సభ్యలు నిరసనల శృతిమించి.. ఏకంగా సభలో విధ్వంస పర్వానికి తెరతీశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి విశ్వాస పరీక్ష కోసం  ఇవాళ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా సభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర గంధరగోళం ఏర్పడింది. రాజ్యంగ విరుద్దంగా ఎమ్మెల్యేలను రిసార్టులో దాచి.. వారిని నేరుగా ఓటింగ్ కు తీసుకురావడంతో అసెంబ్లీలో అధికార పక్షం విశ్వాస పరీక్షను రహస్య ఓటింగ్ పక్రియ ద్వారా చేపట్టాలని డిమాండ్ తో డిఎంకే సహా పన్నీరు సెల్వం వర్గం విధ్వంసానికి పాల్పడింది.

డీఎంకే సభ్యులు ఏకంగా స్పీకర్ ధన్ పాల్ ను టార్గెట్ చేశారు. రహస్య ఓటింగ్ ను సాకుగా చూపి.. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన ఆయనను డీఎంకే సభ్యులు పరాభవించారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న డీఎంకే కోరికను స్పీకర్ తిరస్కరించారు. సభా కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో తనకు తెలపాల్సిన అవసరం లేదని అన్నారు. తాను నిబంధనల ప్రకారమే ఓటింగ్ నిర్శహిస్తున్నట్లు చెప్పుకోచ్చారు. డీఎంకే నేత‌లు స‌భ‌ను వాయిదా వేయాల‌ని డిమాండ్ చేస్తోన్న నేప‌థ్యంలో స్పీక‌ర్ ఆ అంశంపై స్పందిస్తూ స‌భ‌ను రేపటికి వాయిదా వేసే ప్ర‌స‌క్తే లేద‌ని చెప్పారు. ఈ రోజే ఓటింగ్ జరుగుతుందని, దానికి అందరూ స‌హ‌క‌రించాలని న‌చ్చ‌జెబుతూ మొద‌టి డివిజ‌న్ కౌంటింగును పూర్తి చేశారు.

రెండో డివిజ‌న్ లెక్కింపును ముందుకు తీసుకువెళ్ల‌డం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల మ‌ధ్య‌లో త‌ల‌దూర్చకూడ‌ద‌ని స్పీకర్ గ‌ట్టిగా చెప్పారు. ఎలా ఓటింగ్ ప్ర‌క్రియ జ‌ర‌పాలో త‌న‌కు తెలుస‌ని అన్నారు. దీంతో, డీఎంకే ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోయారు. స్పీకర్ ను ఘెరావ్ చేసి ఆయన పోడియంను చుట్టుముట్టడమే కాకుండా, స్పీకర్ పైకి కుర్చీలను విసిరారు. స్పీకర్ టేబుల్ పైకి ఎక్కారు. ఆయన ముఖంలో ముఖం పెట్టి.. బిగ్గరగా నినాదాలు చేశారు. ఆయనకు సభా క్యార్రమాలు ఏమి కనిపించకుండా కవర్ చేశారు. స్పీకర్ పోడియంపై నున్న పేపర్లను చింపి, ఆయన మీదకు విసిరేశారు.  దీంతో, స్పీకర్ కూడా భయభ్రాంతులకు గురైన్టటు తెలుస్తోంది.

కాగా, శాసన సభలో తీవ్ర గంధరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేసిన ను వాయిదా వేశారు. వెంటనే మార్షల్స్ వచ్చి ఆయనను సురక్షితంగా తీసుకెళ్లారు. ఈ సమయంలో కూడా స్పీకర్ చొక్కా పట్టుకుని డీఎంకే ఎమ్మెల్యేలు లాగారు. దీంతో తిరిగి ప్రారంభమైన అసెంబ్లీలో తాను నిబంధనల ప్రకారమే సభను నడుపుతున్నానని చెప్పారు దన్ పాల్. సభలోని డీఎంకే సభ్యుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నా చోక్కాను పట్టుకుని చించారు. నన్ను పట్టుకుని లాగారు ఇది సమంజసమేనా.. స్పీకర్ చైర్ కే విలువను ఇవ్వకపోతే.. సభ ఎలా సాగుతుంది. సభాపతికే సభలో మర్యాద లేదా..? అంటూ అసంతప్తిని వెళ్లగక్కారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles