తమిళనాడులో అసెంబ్లీలో గంధరగోళం.. మూజువాణి ఓటింగ్ Ruckus in TN Assembly over trust vote, OPS camp asks for secret ballot

Ruckus in tn assembly over trust vote ops camp asks for secret ballot

tamil nadu, palnisamy, paneer selvam, sasikala, chief minister, dhanpak, TN assembly speaker, vidyasagar rao, cabinet minister, stalin, dmk, aiadmk, congress, tamil nadu politics

Ruckus broke out in Tamil Nadu Assembly as special session began on Saturday for the key floor test on the confidence motion to be moved by Chief Minister Edappadi K Palanisamy.

తమిళనాడులో అసెంబ్లీలో గంధరగోళం.. మూజువాణి ఓటింగ్

Posted: 02/18/2017 11:22 AM IST
Ruckus in tn assembly over trust vote ops camp asks for secret ballot

తమిళనాట రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. అన్నాడీఎంకే పక్ష నేత పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి.. ఇవాళ బలనిరూపణ చేయనున్న నేపథ్యంలో ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో పళనిస్వామి తన విశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. అయితే విశ్వాస పరీక్షకు ముందు తనను మాట్లాడించాలని పన్నీరు సెల్వం వర్గం డిమాండ్ చేయడంతో అసెంబ్లీలో గంధరగోళం ఏర్పడింది. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా పన్నీరు సెల్వాన్ని మాట్లాడించాలని డిమాండ్ చేయడంతో డీఎంకే కూడా పన్నీరువర్గంతో కలసి సభలో నినాదాలు చేసింది.

దీనిపై పళనిస్వామి వర్గం మాట్లాడుతూ.. పన్నీరువర్గానికి ప్రత్యేక గుర్తింపు లేదని, అది అన్నాడిఎంకేలోని ఒక భాగమం మాత్రమేనని చెప్పడం, పన్నీరును మాట్లాడించాలని ఏ నిబంధనలు చెప్పడం లేదని తేల్చి చెప్పడంతో.. స్పీకర్ ధన్ పాల్ ఏకంగా చర్చలను వాయిదా వేశారు. నేరుగా ఓటింగ్ అంశంలోకి వెళ్లారు. అయితే రహస్య ఓటింగ్ జరపాలన్న పన్నీరు సెల్వం, డీఎంకే వర్గాల వినతిని కూడా స్పీకర్ తోసిపుచ్చారు. బహిరంగ ఓటింగ్ ద్వారానే విశ్వాస పరీక్ష వుంటుందని చెప్పడం.. అందుకునుగూణంగానే చర్యలు చేపట్టడంతో తమిళనాడు అసెంబ్లలో గంధరగోళ పరిస్థితి తీవ్రమైంది. కాగా ఓటింగ్ కు స్పీకర్ అనుమతించడంతో మూజువాణీ ప్రక్రియ ప్రకారం ఓటింగ్ జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles