30 ఏళ్ల తర్వాత ఏం సినిమా చూపిస్తారో? After 30 years Tamil Nadu assembly face floor test.

Tamil nadu cm palanisamy faces floor test today

Palaniswami, Tamil Nadu Floor Test, AIADMK MLAs, AIADMK MLAs Floor Test, DMK MLAs Floor Test, Palaniswami Panneerselvam Floor Test, Tamil Nadu Assembly, Floor Test, 30 Years Tamil Nadu Floor Test, Panneerselvam Floor Test

Palaniswami to take floor test in Tamil Nadu assembly today, Panneerselvam reaches out to AIADMK MLAs.

మళ్లీ 30 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో...

Posted: 02/18/2017 07:28 AM IST
Tamil nadu cm palanisamy faces floor test today

తమిళ్ పొలిటికల్ థ్రిల్లర్ కి నేడు శుభం కార్డు పడబోతుంది. తీవ్ర సంక్షోభానికి పళనిస్వామి ప్రమాణ స్వీకారంతో సగం తెర పడితే, అంతలోనే బలపరీక్ష పేరుతో మరో నరాలు తెగే ఉత్కంఠకు తెర లేచింది. శనివారం అంటే ఈరోజే కొత్త సీఎం పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష పరీక్ష జరుగుతుండటం గమనార్హం.

తొలిసారి 1952లో అప్పటి ముఖ్యమంత్రి రాజాజీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని అరుప్పుకొట్టెలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. దీంతో ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అదే ఏడాది జూలై 3న ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 375 మంది సభ్యులున్న శాసనసభలో 200 మంది రాజాజీకి ఓటేశారు. దీంతో ఆయన నెగ్గారు. దేశంలోనే జరిగిన తొలి అవిశ్వాస తీర్మానం ఇదే కావటం విశేషం.

ఇక రెండోసారి 1972లో డీఎంకే కురువృద్ధుడు, అప్పుడు సీఎంగా ఉన్న కరుణానిధిపై శాసనసభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఎంజీఆర్‌తో కరుణకు విభేధాలు రావటం, ఆపై డీఎంకే కోశాధికారి పదవి నుంచి ఆయన్ని తొలగించటంతో పలువురు శాసనసభ్యులు ఎంజీఆర్‌కు మద్దతు పలికారు. ఫలితంగా డిసెంబరు 11న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, 172 మంది ఎమ్మెల్యేలు కరుణకు జై కొట్టడంతో ఆయన నెగ్గారు.

చివరిగా 1988లో ఎంజీఆర్ మరణించాక అన్నాడీఎంకే పార్టీ జయ, జానకి వర్గాలుగా చీలిపోయింది. అన్నాడీఎంకేకి 198 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, డీఎంకేకు 33 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. దీంతో తమిళనాడు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ సతీమణి ప్రమాణ స్వీకారం చేశారు. బలపరీక్షలో జానకికి 97 మంది, జయలలితకు 33 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. అయితే సభలో బిగ్ ఫైట్ పరిణామాల కారణంగా కేంద్రం అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ఆ సమయంలోనే జయకు ఘోర అవమానం జరిగింది కూడా.

ఇక మళ్లీ ఇన్నాళ్లకు సుమారు 29 ఏళ్ల తర్వాత తమిళనాడు శాసనసభ బలపరీక్షకు వేదిక అవుతోంది. ఇప్పటికే స్టాలిన్ తమ పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డిసైడ్ కాగా, ఉన్న ఒక్క స్వతంత్ర్య ముస్లింలీగ్ ఎమ్మెల్యే కూడా అదే నిర్ణయం తీసుకోవటం విశేషం. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల సంఖ్య 109కి చేరింది. చివరి నిమిషం దాకా ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి దేశం చూపు మొత్తం ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ వైపే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu Assembly  Floor Test  Palaniswami  Panneerselvam  

Other Articles