శశికళకు ఎన్నికల సంఘం నోటీసులు EC asks Sasikala to explain AIADMK general secretary status

Ec asks sasikala to explain aiadmk general secretary status

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, Palanisamy, election commission, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

The election commission issues a notice to Sasikala to explain her appointment as party general secretary.

శశికళకు ఎన్నికల సంఘం నోటీసులు

Posted: 02/17/2017 09:36 PM IST
Ec asks sasikala to explain aiadmk general secretary status

తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు తాజాగా ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎన్నిక చెల్లదంటూ జాతీయ ఎన్నికల సంఘాన్ని పన్నీర్‌ సెల్వం తరఫున ఎంపీ వి. మైత్రేయన్‌ ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్‌ శుక్రవారం ఆమెకు నోటీసులు ఇచ్చింది.

ఈసీ జారీ చేసిన నోటీసులపై ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని అందులో ఆదేశించింది. మరోవైపు శనివారం అసెంబ్లీలో జరిగే బల నిరూపణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పళనిస్వామికి వ్యతిరేకంగా అన్ని విపక్షాలు ఏకమయ్యాయి. కాంగ్రెస్ రేపు ఉదయం సీఎల్పీలో చర్చించిన తరువాత ఈ విషయమై కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనుంది. జైలుకు వెళ్లే కొద్ది గంటల ముందు శశికళ దినకరన్‌ను అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. దీంతో ఎలాగైనా పార్టీని శశికళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లనివ్వకూడదని పన్నీర్‌ సెల్వం ప్రతిన బూనారు.

దీంతో చిన్నమ్మకు వ్యతిరేకంగా పన్నీర్ వర్గం ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎం మైత్రేయన్ సహా మరో 11 మంది అన్నాడీఎంకే నేతలు ఎన్నికల సంఘం అధికారులను కలసి తమ పార్టీ నియమనిభంధల ప్రకారం ఆరు సంవత్సరాలు వరుసగా పార్టీలో సభ్యత్వం వుంటేనే వారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కాగలరని అయితే శశికళ 2011లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారని పన్నీరువర్గం నేతలు ఈసీకి వివరించారు. దీంతో అమెకు ఎన్నకల కమీషనర్ నోటుసులు అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Palanisamy  panneerselvam  election commission  AIADMK  tamilnadu  

Other Articles

Today on Telugu Wishesh