‘‘నా పన్నుపై కాదు ఆటపై దృష్టిసారించండీ’’ Sania Mirza denies tax evasion

Sania mirza denies service tax evasion over telangana award

Tennis champion, sania mirza, central board of excise and customs, telangana government, Hyderabad, Telangana, India

Tennis champ Sania Mirza denied service tax evasion in a response to notices last week issued by the service taxes division of the Central Board of Excise and Customs.

‘‘నా పన్నుపై కాదు ఆటపై దృష్టిసారించండీ’’

Posted: 02/17/2017 06:40 PM IST
Sania mirza denies service tax evasion over telangana award

సేవాపన్ను ఎగవేశారన్న అరోపణలు ఎదుర్కోంటున్న తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, టెన్నీస్ స్టార్ సానియా మిర్జా ఎట్టకేలకు ఈ విషయమై స్పందించారు. తన పన్ను ఎగవేత విషయంపై మీడియా చాలా దృష్టి సారించిందని, అయితే మీడియా తన పన్ను విషయంపై కాకుండా తన అటపై దృష్టి సారిస్తే తాను మరింత సంతోషపడతానని చెప్పింది. తన వ్యక్తిగత విషయంలో మీడియా చూపిన అత్యూత్సాహం అనవరసమని చురకలంటించారు. తన అట విషయంలో ఇలాగే ప్రోత్సహిస్తే బాగుంటుందన్నారు.

తాను సేవా పన్ను ఎగవేయలేదని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సమాధానమిచ్చారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా రాష్ట్ర ప్రభుత్వం సానియామీర్జాకు ఇచ్చిన కోటిరూపాయలపై సేవా పన్ను చెల్లించలేదని సర్వీసు ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జారీ చేసిన సమన్లకు సానియా మీర్జా తన చార్టర్డ్ అకౌంటెంటు ద్వారా సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తనకు శిక్షణ ప్రోత్సాహకంగానే కోటిరూపాయలు ఇచ్చిందని సానియా సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. సానియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా డబ్బు ఇవ్వలేదని చార్టర్డ్ అకౌంటెంటు చెప్పారు.

సర్వీసు ట్యాక్స్ అధికారులు మాత్రం తెలంగాణ సర్కారు ఇచ్చిన కోటి రూపాయలపై సేవా పన్ను కింద 14.5 శాతం డబ్బు చెల్లించాలని నోటీసులో పేర్కొంది. కాగా తెలంగాణ ప్రభుత్వం 2014 జులైలో సానియాను రాష్ట్ర బ్రాండ్ అంబాసిడరుగా ప్రకటించి ప్రధాన టెన్నిస్ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు వీలుగా శిక్షణ కోసం కోటి రూపాయలు ఇచ్చిందని, ప్రోత్సహకాలకు పన్ను ఉండదని చార్టర్డ్ అకౌంటెంట్ సర్వీసుట్యాక్స్ అధికారులకు సమర్పించిన సమాధానంలో వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh