తమిళనాడులో గోపిలు ఎందరు..? ఎటు నుంచి ఎటు..? డీఎంకే వ్యూహమేంటి..? Palaniswami strategy at floor test, issues whip? dmk neutral.?

Palaniswami strategy at floor test issues whip dmk neutral

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, Palanisamy, R. Natarajan, Stalin, Bengaluru, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

Edapaddi Palanisamy the new chief minister of tamilnadu, strategy plays a vital role as he goes for floor test on saturday

తమిళనాడులో గోపిలు ఎందరు..? ఎటు నుంచి ఎటు..? డీఎంకే వ్యూహమేంటి..?

Posted: 02/17/2017 01:53 PM IST
Palaniswami strategy at floor test issues whip dmk neutral

శశికళ వర్గం నేత పళనిసామి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో సంబరాల్లో మునిగితేలుతున్న ఆయన వర్గానికి ఇప్పుడే అసలు పరీక్ష ప్రారంభమైంది. ముందుగా సోమవారం రోజున బలాన్ని నిరూపించుకుంటానని ప్రకటించిన అయన తరువాత శనివారం రోజునే అందుకు ముహూర్తాన్ని ఖాయం చేశారు. గవర్నర్ తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పిలిచిన తరుణంలో తనకు 123 మంది ఎమ్మల్యేల బలం వుందని చెప్పిన పళనిస్వామి.. తన మాట ప్రకారం అంతమంది బలాన్ని నిరూపించుకోగరా..? లేదా..? అన్నదే అసలు ప్రశ్న.

అమ్మ విధేయుడిగా పేరోందిన ఆఫధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శశికళ వర్గం నుంచి తన బృందంలోకి వలసలు వస్తాయన్నదే నిజమైతే.. అది శనివారం రోజున అవిష్కృతం కానుంది. అదే జరిగితే పన్నీరు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోగలరా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పన్నీరు బృందంలోకి తన వర్గం ఎమ్మెల్యేలను వెళ్లనీయకుండా ముఖ్యమంత్రి పళనిస్వామి ఏవిధమైన వ్యూహాలను రచిస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పన్నీరు సెల్వం మినహా అన్నాడీఎంకే పార్టీకి చెందిన అందరు సభ్యులు తమతోనే వున్నారని పళనిస్వామి, తంబిదురైలు ఘంటాపథంగా చెబుతున్న నేపథ్యంలో గత కొన్నాళ్లుగా గొల్డన్ బే రిసార్టు నుంచి పన్నీరు సెల్వం వర్గంలోకి దూకిన ఎమ్మెల్యేలు మళ్లీ తిరిగి జంప్ జిలానీ అంటూ పళనిస్వామి జట్టులోకి చేరుతారా..? బలనిరూపణ సమయంలో ఎటు నుంచి ఎటు వలసలు వెళ్లనున్నాయి..? ఎవరెవరు ఎటు వైపుకు మళ్లుతారన్నది అసక్తికరంగా మారింది.

ఇప్పటికే మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే.. మాజీ తమిళనాడు డీజీపీ ఆర్ నటరాజ్.. తాను అసెంబ్లీ బలనిరూపణ సమయంలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని ప్రకటించారు. అయితే అదే సమయంలో తాను తమిళనాడు ప్రజలు, తన నియోజకవర్గ ప్రజలు తీర్పును గౌరవించి ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇలా మరెందరు ఎమ్మెల్యేలు గోడ దూకుతారన్నది తీవ్ర ఉత్కంఠకు తెరతీస్తుంది. ఇలాంటి వారిని కట్టడి చేయడానికి పళనిస్వామి ఎలాంటి పథకరచన చేస్తున్నరన్నది కీలకంగా మారింది.

అసెంబ్లీలో బలనిరూపణ నేపథ్యంలో తమ వర్గం ఎమ్మెల్యేలకు పళనిస్వామి విఫ్ జారి చేస్తారన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. అదే జరిగితే విఫ్ దిక్కారణ కింద తనకు అనుకూలంగా ఓటు వేయని పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం వుండనుంది. దీంతో ఈ అంశాన్ని పళనిస్వామి వర్గీయులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక పన్నీరుసెల్వం వర్గానికి బలం లేనందున.. ఆయన మౌనంగానే వుండనున్నారన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. అయితే పళనిస్వామి వర్గం నుంచి చీలికలను ప్రేరేపిస్తే.. మరో ప్రత్యర్థిగా వున్న డీఎంకే లభ్దిపోందే అవకాశం వుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక అధికార పార్టీలో చీలికలు వస్తాయా..? అన్న అంశాన్ని తటస్థంగా వుండి డీఎంకే పరిశీలిస్తుంది. అందుకు అనుగూణంగా ఇవాళ జరగనున్న పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించనుంది. బలపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామి మెజార్టీ నిరూపించుకుంటారా? మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు ఎలా వ్యవహరిస్తారన్న విషయాలపైనా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. కాగా అన్నా డీఎంకే రాజకీయాల్లో తలదూర్చరాదని, బలపరీక్షలో తటస్థంగా ఉండాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం స్టాలిన్ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశమై చర్చించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Palanisamy  panneerselvam  R. Natarajan  Stalin  governer  AIADMK  tamilnadu  

Other Articles

Today on Telugu Wishesh