పంజాబ్ లో దారుణం.. వ్యాపారి చంపి పాటలు పాడిన హంతకులు Gangsters dance around slain trader

Tamil nadu care taker cm panneerselvam political future in dilema

Gangsters dance around slain trader, Hardev Singh, financier, Longowal police station, Sajan Singh, Sangrur, gangsters, Dalvinder Singh, Babli Randhawa, facebook, crime

A 25-year-old financier was shot dead in the main market of Longowal, Sangrur, on Thursday morning by a group of five gangsters

పంజాబ్ లో దారుణం.. వ్యాపారి చంపి పాటలు పాడిన హంతకులు

Posted: 02/17/2017 11:57 AM IST
Tamil nadu care taker cm panneerselvam political future in dilema

పంజాబ్‌లో దారుణం జరిగింది. పట్టపగలు  అందరూ చూస్తుండగా, ఓ వ్యాపారిని అడ్డగించిన రౌడీమూకలు తుపాకులతో అతన్ని కాల్చిచంపాయి. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అతని శవం చుట్టూ చేరి డాన్సులు చేశాయి. అంతటితో అగకుండా పోలీసులకు నిజంగా దమ్ముంటే తమను పట్టుకోవాలని కూడా సవాల్ విసిరాయి. వ్యాపారిని చంపిన వీడియోలు, అతడ్ని ఎందుకు హతమార్చాల్సి వచ్చిందన్న వివరణతో కూడిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాయి.

ఈ ఘటన పంజాబ్ లో సంగ్రూర్ సమీపంలోని లోంగోవాల్ పట్టణంలో గల ప్రధాన మార్కెట్లో పట్టపగలు జరిగింది. పాత గొడవలు కారణంగానే వ్యాపారిని హర్దేవ్ సింగ్ ను గ్యాంగ్‌స్టర్ దల్వీందర్ సింగ్ అలియాస్ బబ్లీ రణ్‌ధవా నేతృత్వంలోని ఐదుగురు గ్యాంగ్‌స్టర్లు ఈ దారుణానికి ఒడిగట్టారు. దల్వీందర్ ఇటీవలే వేరే కేసులో బెయిల్ పొంది జైలు నుంచి విడుదలయ్యాడు. దాంతో పక్క ప్రణాళిక ప్రకారం ఉదయాన్నే మార్కెట్ లోకి వచ్చి హర్దేవ్ సింగ్ ను హతమార్చారు.

కేసు వివరాల్లోకి వెళ్తే.. హర్‌దేవ్ సింగ్ అనే ఫైనాన్స్ వ్యాపారి దల్వీందర్‌కు రూ. 5 లక్షలు అప్పు ఇచ్చాడు. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య గత జనవరి 31న గొడవ జరిగింది. అయితే వారికి బయపడకుండా హర్దేవ్ సింగ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. అయితే కేసులు ఎందుకు రాజీ చేసుకుందామన్న గ్యాంగ్‌స్టర్ పిలుపుతో ఇటీవలే రాజీ కుదుర్చుకున్నారు. కేసు విత్ డ్రా చేసుకున్న తరువాత.. గ్యాంగ్‌స్టర్ తన బుద్ది చూపించారు. పట్టపగలు అందరూ చూస్తుండగా, ఫైనన్షియర్ దుకాణంలోకి వెళ్తుండగా, అతడ్ని చుట్టుముట్టి తలలోకి ఐదు బుల్లెట్లు కాల్చడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత అతడి శవం వద్ద డాన్సులు చేస్తూ వాళ్లు సంబరాలు చేసుకున్నారు. పోలీసులు దమ్ముంటే తనను పట్టుకోవాలని సవాలు కూడా చేశాడు.

ఈ నేరం చేసిన తర్వాత.. రణ్‌ధవా తన ఫేస్‌బుక్ పేజీలో నాలుగు వీడియోలు పోస్ట్ చేశాడు.  'మారే హిక్ విచ్ ఫైర్ జాట్ నే' (ఆ జాట్ గుండెల్లో కాల్చాడు) అనే పాట పాడుకుంటూ.. హత్య చేసింది తానేనని ఆ వీడియోలో చెప్పాడు. చేతిలో తుపాకి కూడా పట్టుకుని కనిపించాడు. హర్‌దేవ్‌ను ఎందుకు చంపిందీ మరో వీడియోలో తెలిపాడు. ఈ హత్యలో అతడితో పాటు అతడి అనుచరులు అమన్ సింగ్, నాన్సీ, వరీందర్ సింగ్, సుర్జా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
 
నిందితులను అరెస్టు చేసేవరకు తన కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వీల్లేదని మృతుడి తండ్రి సజన్ సింగ్ పట్టుబట్టారు. పట్టపగలు పది గంటల సమయంలో ఇలా జరిగినా ఇంతవరకు ప్రధాన నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. నిందితుడు బబ్లీ స్థానిక హిస్టరీ షీటర్ అని, ఇది చాలా హేయమైన నేరమని.. అతడిని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నామని సీనియర్ ఎస్పీ ఇందర్‌బీర్ సింగ్ తెలిపారు. అతడు ఎక్కడి నుంచి ఫేస్‌బుక్‌లో వీడియోలు అప్‌లోడ్ చేశాడో గుర్తించే ప్రయత్నంలో ఉన్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardev Singh  financier  Longowal police station  gangster  Facebook  Babli Randhawa  facebook  crime  

Other Articles