లేటు వయస్సులో భర్త పాడు పనులు.. ‘సుప్రీం’కు భార్య..! mumbai women moves sc to ban porn sites

Mumbai woman says husband is addicted to porn so sc should ban it for everyone

porn sites, husband, adiction, porn websites, pornography in india, india pornography, supreme court, porn websites in india, mumbai

Mumbai-based woman has approached the Supreme Court with a plea that the apex court with Centre should take immediate steps to ban porn sites.

లేటు వయస్సులో భర్త పాడు పనులు.. ‘సుప్రీం’కు భార్య..!

Posted: 02/16/2017 06:38 PM IST
Mumbai woman says husband is addicted to porn so sc should ban it for everyone

‘‘ముసలితనానికి కుసుమగుడాలు’’ అని అచ్చ తెలంగాణలో ఓ నాటు సామెతను నిజం చేస్తున్నాడు ముంబైలోని ఓ విద్యావంతుడు. తనకు వయస్సు పెరుగుతున్న కోద్ది.. ఇంట్లో వున్న పిల్లలకు సద్బుద్దులు చెప్పడానికి బదులు తానే తప్పులు చేస్తూ కుటుంబసభ్యుల చేత బుద్దిచెప్పించుకుంటున్నారు. ఇంతకీ ఆయన చేసిన పనేంటీ అంటే.. ఆరు పదులు దాటిన వయస్సులోనూ కంప్యూటర్లో నెట్ ద్వారా నీలిచిత్రాలను చూడటం. అంతే అవి చూస్తూ తాను ఇంట్లో వున్నానన్న విషయాన్ని కూడా మర్చిపోవడం. ఎవరు వస్తున్నా.. ఎవరు వెళ్తున్నా పట్టించుకోకుండా పోద్దస్తమానం కంప్యూటర్ ముందు కళ్లప్పగించుకుని కూర్చోవడం.

దీంతో చారాకెత్తుకోచ్చిన ఓ భార్య తన కాపురాన్ని నిలబెట్టాలంటే.. ఫోర్న సైట్లను తక్షణం నిషేధించాలని డిమాండ్ చేస్తూ.. దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని అశ్రయించింది. తన భర్త పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లకు బాగా బానిస అయిపోయాడని, అది తమ వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తోందని.. అందువల్ల వాటిని నిషేధించాలని కోరుతూ ఒక మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి అశ్లీల సైట్ల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేలా సుప్రీం ఆదేశించాలని ముంబైకి చెందిన ఆ మహిళ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.

అతడు బాగా చదువుకున్న వ్యక్తే అయినా, పెద్దవయసు వస్తున్నా ఇలా చేస్తున్నప్పుడు ఇక యువతరం ఇంకెంత పాడవుతుందోనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇంటర్‌నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో తన భర్త ఎక్కువసేపు ఆ సైట్లు చూస్తూనే కాలం గడిపేస్తున్నాడని, దానివల్ల అతడి బుర్ర పాడైపోయి తన వైవాహిక జీవితాన్ని కూడా నాశనం చేస్తోందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు పెళ్లయ్యి 30 సంవత్సరాలు అవుతోందని, కానీ గత రెండేళ్ల నుంచే తన భర్త ఈ పోర్నోగ్రఫీ సైట్లకు అలవాటు పడ్డాడని ఆమె కోర్టుకు చెప్పారు.
 
తన భర్త చేస్తున్న పనుల వల్ల తాను, తన పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని, దీనివల్ల తమ సంసారం కూడా ఇబ్బందుల్లోనే ఉందని అన్నారు. తాను సామాజిక కార్యకర్తను కావడంతో ఇలాంటి వాళ్లను చాలామందిని చూస్తున్నానని, అందువల్ల వీటి నిరోధానికి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లల పోర్నోగ్రఫీకి సంబంధించిన సైట్లన్నింటినీ బ్లాక్ చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే కేంద్రాన్ని గట్టిగా ఆదేశించింది. అలా నిషేధించడం కష్టమని చెప్పడానికి వీల్లేదని, అలా చెబితే తమ ఆశాలను ఉల్లంఘించినట్లే అవుతుందని చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : porn sites  husband  adiction  supreme court  mumbai  india  

Other Articles

Today on Telugu Wishesh