పళని క్యాబినెట్లో 31 మంది.. సోమవారమే బలనిరూపణ.. 31 members in palanisamy cabinet

31 members in palanisamy cabinet floor test on monday

Tamil Nadu, chief minister, late cm J Jayalalithaa, VK Sasikala, disproportionate case, Palanisamy, , Bengaluru, O.Panneerselvam, supreme court, vidyasagar rao, PM modi, Governor, tamil politics

AIADMK Legislature Party Leader Edapaddi Palanisamy to form the government in next few minutes in the presence of Governor Ch Vidyasagar Rao, along with 31 members of his cabinet

పళని క్యాబినెట్లో 31 మంది.. సోమవారమే బలనిరూపణ..

Posted: 02/16/2017 03:19 PM IST
31 members in palanisamy cabinet floor test on monday

గత పది రోజులుగా తమిళనాడులో చోటేచేసుకున్న రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ.. రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఇవాళ నిర్ణయాన్ని తీసుకోవడంతో.. అన్నాడీఎంకే శాసనసభా పక్ష్ నేతగా పళని స్వామి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. చెన్నైలోని రాజ్ భవన్ లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగనుంది. ఈ కార్యక్రమంలో పళనిస్వామితో పాటుగా 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ సీనియర్లు సెంగోట్టాయన్, ఉదయ్ కుమార్ తదితరులకు క్యాబినెట్ లో కీలక పదవులు దక్కనున్నాయని సమాచారం

గవర్నర్ నుంచి ఆహ్వానం వ‌చ్చిన నేప‌థ్యంలో అన్నాడీఎంకే శాస‌న‌స‌భ ప‌క్షనేత ప‌ళ‌నిస్వామి తన కేబినెట్ లోని మంత్రుల వివ‌రాల‌ను రాజ్ భవన్ కు అందజేశారు. కీలకమైన ఆర్థిక, హోం శాఖలను పళనిస్వామి తన దగ్గరే ఉంచుకున్నారు. ఇక స్కూల్ ఎడ్యుకేషన్, క్రీడా శాఖ మంత్రిగా సెంగొట్టియ‌న్‌,  స‌మాచార మంత్రిగా కడంబుల్ రాజు, చేనేత శాఖ మంత్రిగా కోదండ‌పాణి, ప‌శుసంవ‌ర్థక శాఖ మంత్రిగా బాల‌కృష్ణా రెడ్డి, విద్యాశాఖ మంత్రిగా అలెగ్జాండ‌ర్‌, అటవీ శాఖ మంత్రిగా శ్రీనివాసన్ ల‌ను నియ‌మించ‌నున్నట్లు ఆయ‌న గ‌వ‌ర్నర్‌కు పంపిన నివేదిక‌లో పేర్కొన్నారు.

కాగా, అసెంబ్లీలో 15 రోజులలోపు బలం నిరూపించుకోవాలని గవర్నర్ విద్యాసాగర్ రావు సూచించిన మేరకు పళనిస్వామి వచ్చే సోమవారమే బలనిరూపణకు సిద్ధమని తెలిపారు. మరికాసేపట్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ప్రత్యర్థి వర్గంగా పేరొందిన పన్నీరుసెల్వం తాన చివరి నిమిషం వరకు శశికళకు వ్యతిరేకంగానే పోరాడుతానని, శశికళ కుటుంబసభ్యుల చేతుల్లోకి పార్టీని వెళ్లనీయకుండా అడ్డుకుంటామన్నారు. ప్రస్తుతం అయన తన బృందంసభ్యులతో కలసి ఎన్నికల సంఘం అధికారుల వద్దకు చేరుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J Jayalalithaa  VK Sasikala  Palanisamy  panneerselvam  vidyasagar rao  governer  AIADMK  tamilnadu  

Other Articles