పన్నీర్ ఇక పనికిరాడు. అయితే అధికారం... లేకుంటే ఎన్నికలు! | Stalin sees early TN election due to unstable govt.

Dmk chief stalin sees early tn election

DMK Party, Working President, M K Stalin, M K Stalin O Panneerselvam, Stalin Elections, Stalin AIADMK Government, Tamil Nadu Elections, Stalin Karunanidhi, Unstable Government Stalin

DMK Working President M K Stalin claimed a government led by either O Panneerselvam or any AIADMK nominee would not be stable and could lead to elections to the state assembly even before local body polls.

స్టాలిన్ మాస్టర్ ప్లాన్ వెనుక ఎవరున్నారు?

Posted: 02/16/2017 08:20 AM IST
Dmk chief stalin sees early tn election

అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభం నెలకొన్న వేళ పరిస్థితులను ఎలాగైనా తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రతిపక్ష డీఎంకే భావిస్తోంది. శశికళ తీర్పు వెలువడక ముందు దాకా సెల్వంకు సపోర్ట్ అన్న చందాన వ్యవహరించిన ఆ పార్టీ చీఫ్ స్టాలిన్, సుప్రీం తీర్పు తర్వాత కిక్కరుమనకుండా ఉండిపోయాడు. ఇక ఇప్పుడు ఏదైనా లాభం ఉంటుందంటే తప్ప, ఈ వ్యవహారంలో కల్పించుకోవద్దన్న రాజకీయ కురువృద్ధుడు, తండ్రి అయిన కరుణానిధి సలహా మేరకు నడుచుకుంటున్నట్లు సమాచారం. 

నిజానికి పన్నీర్ సెల్వం వర్గంలోకి కనీసం 40 నుంచి 50 మంది వరకూ రావచ్చని తొలుత అంచనాలున్న నేపథ్యంలో, ఆ పార్టీకి మద్దతిస్తామన్న సంకేతాలు పంపిన డీఎంకే, ఆ కౌంట్ తక్కువగా ఉండటంతో ఆ ఆలోచనేదీ లేదన్నట్లు వ్యవహరిస్తోంది. కనీసం 25 మంది పన్నీర్ పంచన చేరితే, ఆయన మద్దతుతో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. ఒకవేళ అది జరగకపోతే మాత్రం రాజకీయంగా అలజడి రేపి మళ్లీ ఎన్నికలు సృష్టించాలన్నదే డీఎంకే పెద్దాయనగా ప్లాన్ గా కనిపిస్తోంది.

ఎలాగైనా సరే తన తండ్రిని మరోసారి సీఎం పీఠంపై కూర్చోబెట్టాలన్న టార్గెట్ తో స్టాలిన్ పావులు కదుపుతున్నారు. ఒకవేళ అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే, అధిక ఎమ్మెల్యేలు ఉన్న పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. చెన్నైకి ఎవరూ రావొద్దంటూ చెబుతూనే మరోవైపు ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలంటూ సంకేతాలు పంపాడు కూడా. ఇక ప్రస్తుతం పన్నీర్ శిబిరంలో 13 మంది ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు.

పళనిస్వామి వద్ద 124 మంది ఉన్నట్టు సమాచారం. డీఎంకే కు 89 మంది, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ కు 8 మంది ఎమ్మెల్యేలుండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ పళనిస్వామిని సీఎం కానీయకుండా చూడటమే స్టాలిన్ ముందున్న ఏకైక లక్ష్యంగా తెలుస్తోంది.

 

డీఎంకే ఎంట్రీ... సెల్వంకు కొత్త సమస్య

 

స్టాలిన్ కు చిన్నమ్మ వార్నింగ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DMK  MK Stalin  Tamil Nadu  Unstable Government  Elections  

Other Articles