ట్రంప్ ‘వీసా’ నిర్ణయం మన మంచికే.. ఎలాగంటే... | Mukesh Ambani

Mukesh ambani says donald trump may be good for india

RIL Chairman, Mukesh Ambani, Donald Trump, Mukesh Ambani Donald Trump, Mukesh Trump, Mukesh Ambani and Trump, Trump India, Trump Visa Decision, Nasscom summit 2017, Nasscom summit Mukesh Ambani, Donald Trump Good India, Trump Visa Amendments

At Nasscom summit RIL Chairman Mukesh Ambani says American President Donald Trump's Visa Decision good for India. Actually be a blessing in disguise for IT players. "Trump can actually be a blessing in disguise. The domestic IT industry can focus on solving problems right here, which is a huge market,"

ట్రంప్ నిర్ణయాలు భారత్ మంచికేనంట!

Posted: 02/16/2017 07:55 AM IST
Mukesh ambani says donald trump may be good for india

ఇచ్చిన మాట తప్పకుండా వలసవాదులకు షాకిస్తూ వీసా చట్టంతో చుక్కలు చూపిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ దెబ్బకి ప్రపంచ దేశాలపై, ముఖ్యంగా భారత్ పై తీవ్ర ప్రభావం చూపసాగింది. అయితే అగ్ర రాజ్యం అధినేత తీసుకున్న నిర్ణయం ఓ రకంగా భారత ఐటీ ఇండస్ట్రీకి, ఇక్కడి టెక్నాలజీ నిపుణులకు మరిన్ని మంచి అవకాశాలను దగ్గర చేయనుందట. ఇండియన్ బిలీనియర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

బుధవారం నాస్కామ్ ఆధ్వర్యంలో జరుగుతున్న లీడర్ షిప్ ఫోరమ్ లో పాల్గొని ప్రసంగించిన ఆయన పై వ్యాఖ్యలు చేశాడు. ట్రంప్ ఆంక్షలతో దేశవాళీ ఐటీ రంగం సమస్యల పరిష్కారానికి కృషి చేసి, అతిపెద్ద ఐటీ మార్కెట్ లో సత్తా చాటేలా లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ట్రంప్ రక్షణాత్మక విధానం వాస్తవానికి ఆశీర్వాదం వంటిదేనని ఆయన అన్నారు. 155 బిలియన్ డాలర్లకు ఐటీ పరిశ్రమ ఎదిగిందని గుర్తు చేసిన ఆయన, మొత్తం ఆదాయంలో 65 శాతం అమెరికా నుంచే వస్తున్నదని, ఈ పరిస్థితిని మార్చే అవకాశాన్ని ట్రంప్ మన ముందుంచారని అన్నారు.

పాశ్చాత్య దేశాలన్నీ తమ వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు అడ్డుగోడలు నిర్మించుకుంటున్నాయి. కానీ, ఒక రకంగా అది (భారత్) కు చాలా మంచిందేనంటూ తెలిపాడు. జియో 100 మిలియన్ల కస్టమర్లను తాకిందని తెలిపిన ఆయన భవిష్యత్తులో దాని కొనసాగింపు త్వరలో కీలక నిర్ణయం ప్రకటించనున్నట్లు వివరించాడు. ఇక ఐటీ ఇండస్ట్రీ వృద్ధి గణాంకాలను గతంలో ప్రకటించిన 10 నుంచి 12 శాతం బదులు 8 నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్టు నాస్కామ్ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Donald Trump  Visa Amendments  Mukesh Ambani  Nasscom Summit  

Other Articles