పన్నీర్-కాంగ్రెస్... శశికళకు ఇక సినిమానే! | Sasikala face trouble with Stalin New Statement.

Panneerselvam new problem with mlas

Tamil Nadu Politics, Sasikala Natarajan, Tamil Nadu Assembly Floor Test, DMK Chief Stalin, Stalin OPS, Stalin Panneerselvam, Sasikala Floor Test, Missing AIADMK MLAs, Madras High Court AIADMK MLAs, AIADMK MLAs Resort, Golden Resort MLAs, Sasikala Stalin, DMK Panneerselvam

New twist in Tamil nadu Politics. Sasikala Ready for Floor Test. Panneerselvam To Work As Chief Minister Today At His Office,. DMK Chief Stalin announced they will support O Panneerselvam in assembly floor test.

డీఎంకే ఎంట్రీ... సెల్వంకు కొత్త సమస్య

Posted: 02/13/2017 10:17 AM IST
Panneerselvam new problem with mlas

ఓవైపు శశికళ నటరాజన్ ఎమోషనల్ గా ఎమ్మెల్యేలను ఎంత బుజ్జగిస్తున్నప్పటికీ అందులో ఉన్న కొందరు మాత్రం ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో వార్త చిన్నమ్మను తెగ కంగారు పెడుతోంది. పన్నీర్ సెల్వం విషయాని కొస్తే, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 7. శశికళ వర్గంలోని పదకొండు మంది ఎమ్మెల్యేలు కనుక పన్నీర్ గూటికి చేరి, ఆయనకు మద్దతు ప్రకటిస్తే పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారిపోతాయి. అప్పుడు, పన్నీర్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 18 అవుతుంది. ఇక శశికళ తన సొంత బలంతో సీఎం అయ్యే అవకాశాలు ఉండవు. ఇతర పార్టీలపై ఆమె ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఆమెకు ఎలాగూ మద్దతు ఇవ్వవనే విషయమై ఆ పార్టీల నాయకులు తరచుగా చేస్తున్న ప్రకటనల ద్వారా స్పష్టం అవుతోంది. అవసరమైతే, పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తామని ఇప్పటికే డీఎంకే ప్రకటించింది. ఒకవేళ, శశికళ వర్గం ఎమ్మెల్యేల్లో పదకొండు మంది కనుక పన్నీర్ గూటికి చేరితే డీఎంకే మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పరచడం ఖాయమవుతుంది. ఇదే కనుక జరిగితే, పన్నీర్ కు సీఎం కుర్చీ దక్కడం, చిన్నమ్మకు నిరాశ ఎదురవడం తప్పదని ఆయన అభిమానులు అంటున్నారు. మరోవైపు ఇదే అదనుగా డీఎంకే రంగంలోకి దిగింది. సెల్వంకు మద్ధతుపై ప్రత్యక్షంగా ప్రకటన చేయకపోయినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలంటూ ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు పిలుపునివ్వటం చర్చనీయాంశంగా మారింది.


ఓపీఎస్(ఆపరేషన్ శశికళ)...

పన్నీర్ సెల్వం కొత్త ఎత్తులు రచిస్తున్నారు. శశికళ ఎమ్మెల్యేలను ఉంచిన రిసార్ట్‌కు వెళ్లాలని భావించినా పోలీసులు వారించడంతో వెనక్కి తగ్గారు. విషయం తెలిసిన శశికళ వర్గం అప్రమత్తమై ప్రైవేటు సైన్యాన్ని మోహరించింది. శశికళపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఓపీఎస్‌ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖుల మద్దతు సంపాదించడంలో విజయం సాధించినా ఎమ్మెల్యేల నుంచి మాత్రం పెద్దగా స్పందన లేకపోవడం ఆయనను బాధిస్తోంది. ఆదివారం నాటికి ఆయన జై కొట్టింది ఆరుగురు ఎమ్మెల్యేలే. వీరికి తోడుగా 11 మంది ఎంపీలు కూడా ఆయనకు మద్దతు తెలిపారు.

Panneerselvam Sasikala MLAs

ఎంపీలందరూ ఓపీఎస్ వైపు పరుగులు తీసేందుకు గల కారణాలపై శశికళ వర్గం ఆరా తీస్తుంటే, ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు ఎందుకు రావడం లేదని ఓపీఎస్ వర్గం తర్జన భర్జన పడుతోంది. రెండు వర్గాలు లోపాలపై రంధ్రాన్వేషణ చేస్తున్నాయి. ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచాలని పన్నీర్ వ్యూహరచన చేస్తున్నారు. సోమవారం పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఉండగా, మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం గవర్నర్ ను కలిసేందుకు సిద్ధం అవుతుండగా, పిలుపు కోసం శశికళ ఆత్రుతగా ఎదురు చూస్తోంది.

అన్నాడీఎంకేకు మొత్తం 134 మంది ఎమ్మెల్యేలు వున్నారు. వీరిలో ఏడుగురు పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపారు. తమ శిబిరంలో 127 మంది ఉన్నారని శశికళ శిబిరం నేతలు చెబుతున్నప్పటికీ, వారి వద్ద 93 మంది మాత్రమే ఉన్నట్టు అనధికార వర్గాల భోగట్టా. ఇదే నిజమైతే మిగతా 35 మందీ ఎక్కడున్నారు? గత ఐదు రోజులుగా వీరి గురించిన సమాచారం బయటకు వెల్లడి కాలేదు. వీరిలో అత్యధికులు పన్నీర్, శశికళ సామాజిక వర్గమైన దేవర్ కులానికి చెందినవారేనని తెలుస్తోంది. దీంతో వీరు ఎటువైపు నిలుస్తారన్నది సస్పెన్స్ గా ఉంది. మరోవైపు మంత్రి పాండియరాజన్ ఆదివారం మైలపూర్ శాసనసభ్యుడు నటరాజన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడు. అయితే తాను ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోలేనని, కొంత సమయం కావాలని నటరాజన్ చెప్పినట్లు సమాచారం. ఇంకోవైపు పన్నీర్ ఎత్తులను చిత్తు చేసే పనిలో శశి వర్గం బిజీగా ఉంది.

హైకోర్టు పిల్ టెన్షన్.. టెన్షన్...

మద్రాసు హైకోర్టులో దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల విచారణలో భాగంగా ఎమ్మెల్యేలు ఏం అనుకుంటున్నారో తెలియజేయాలని కోర్టు ఆదేశించడంతో, రిసార్టుకు వెళ్లిన పోలీసులు, వారి వాదనను విని, దాన్ని లిఖిత రూపంలో తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు దిశగా, ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారు? రిసార్టులో బలవంతంగా ఉంచారా? సెల్ ఫోన్లు లాగేసుకున్నారా? గత ఐదు రోజులుగా మీ ఫోన్ల నుంచి ఎవరితో మాట్లాడారు? వంటి ప్రశ్నలను పోలీసులు సంధించినట్టు తెలుస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల లెక్కలపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, మ్యాజిక్ ఫిగర్ 117ను శశికళ చేరుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Madras High Court MLAs Missing

ఆ సంతకంపై అనుమానం?

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పిస్తూ పన్నీర్ సెల్వం పంపిన లేఖలోని సంతకంపై రాజ్‌భవన్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. నిజానికి రాజీనామా లేఖను గవర్నర్‌ను కలిసి నేరుగా అందజేయాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో గవర్నర్ ముంబైలో ఉండడంతో ఫ్యాక్స్ ద్వారా ఓపీఎస్ ఆ లేఖను గవర్నర్‌కు పంపారు. ఆ తర్వాత సీల్డ్ కవర్‌లో ఆ లేఖను రాజ్‌భవన్ అధికారులకు అందజేశారు. ఈనెల 9న గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నై చేరుకున్నాక ఆ లేఖను పరిశీలించారు. అందులో సీఎం పన్నీర్ సంతకం చూసి అది ఆయనదా? కాదా? పరిశీలించాలంటూ అధికారులను ఆదేశించారు. పరిశీలించిన అధికారులు సంతకంలో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. నిజానికి ఓపీఎస్ తన సంతకం వద్ద తేదీలను, సమయాన్ని రాయరు. కానీ తాజా లేఖలో అవి ఉన్నాయి. దీంతో ఈ కొత్త సమస్యపై రాజ్ భవన్ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇదిలా ఉంటే సచివాలయానికి వెళ్లి విధులు నిర్వహించేందుకు పన్నీర్ సెల్వం సిద్ధమౌతున్నాడన్న తాజా వార్త ఒకటి బయటికి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu Politics  Sasikala Natarajan  Panneerselvam  Stalin  

Other Articles