‘‘నీళ్లు లేకుండా స్నానం.. సబ్బు లేకుండా నురుగులు’’ Shiv Sena defend Congress PMs, attacks PM Modi's raincoat jibe

Shiv sena defend congress pms attacks pm modi s raincoat jibe

shiv sena, shiv sena pm modi, modi raincoat remark, demonetisation, man mohan singh, indira gandhi, rajiv gandhi, pv narsimha rao, raincoat jibe, modi manmohan remark, pm modi, modi news, shiv sena manmohan, manmohan insulted, congress shiv sena, india news

Shiv Sena has rushed to the defence of the Congress leadership and claimed that the country has attained its stature in the world because of the work of the previous Congress-led governments.

‘‘నీళ్లు లేకుండా స్నానం.. సబ్బు లేకుండా నురుగులు’’

Posted: 02/10/2017 03:01 PM IST
Shiv sena defend congress pms attacks pm modi s raincoat jibe

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై శివసేన అధికార పత్రిక సామ్నా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకున్న శివసేన పార్టీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది. అదే తరుణంలో ప్రధాని పలు సందర్భాలలో సంధించిన ప్రశ్నలకు జవాబులను ఇస్తూనే వ్యంగ్యంగా తిప్పికోట్టింది. దేశాన్ని గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రధానులు ఏం చేశారన్న ప్రశ్నలను సంధించేవాల్లు దేశంలో తిరిగిచూస్తే వివరాలు తెలుస్తాయని, అంతేకానీ నిత్యం విదేశాల్లో తిరిగేవారికి ఏం తెలుస్తాయని ఎద్దవా చేసింది.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ప్రచారం చేస్తూ.. గత యూపీఏ ప్రభుత్వంలో చోటుచేసుకున్న కుంభకోణాలు చూసి ప్రపంచ దేశాల ముందు మనం చిన్నబోయామన్ని అన్నారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ప్రధాని గత ప్రధానులపై చేస్తున్న విమర్శలకు చూసి ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయని విమర్శించారు. దేశానికి ప్రధానిగా కొనసాగుతున్న వ్యక్తులు తమ హుందాతనంతో వ్యవహరించాల్సింది పోయి మాజీ ప్రధానుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సహేతుకం కాదన్నారు.

దేశంలో కోసం స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాణాలను అర్పించారని, అ విషయం కూడా కమలనాధులకు తెలియకుండా పోయిందా అని ప్రశ్నించారు. ఇక రాజీవ్ గాంధీని అవినీతి మకిలీ అంటిందన్న విషయాన్ని పక్కనబెడితే.. ఆయన తన హయాంలో ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ది చెందుతున్న కంప్యూటర్ ను భారత్ తీసుకురావడంతో పాటు టెలీ కమ్యూనికేషన్ రంగాన్ని కూడా దేవానికి తీసుకువచ్చారన్నారు. ఇక పివీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లు దేశ అర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి కాపాడి గాడిలో పెట్టారన్నారు.

కాంగ్రెస్ ప్రధానులందరూ వారి హయాంలో ఆయా చర్యలు తీసుకున్నారు కాబట్టే.. దేశం ప్రపంచ దేశాలతో ధీటుగా అభివృద్దిలో పయనిస్తుందని అన్నారు. సూదిని కూడా ఉత్పత్తి చేయలేని దేశం ఇప్పడు పారిశ్రామికంగా, అర్థికంగా పురోగతిని సాధించిందన్నారు. లేనిపక్షంలో ప్రధాని మోడీ చేతులకు దుమ్ముదులుపుకోవడం తప్ప ఏమి చేసేవారు కాదన్నారు. గత ప్రధానులు చేసిన మంచి కార్యాలను, శ్లాఘించాల్సింది పోయి వారిపై అదేపనిగా దుమ్మెత్తిపోయడం కమలనాథులకు మంచిది కాదన్నారు.

ప్రధాని తన నెగిటివ్ మైండ్ సెట్ ను మార్చుకోవాలని సూచించారు. తన నిర్ణయాలను ప్రజలందరిపై రుద్దడంతో పాటు దానిపై విమర్శలు చేసిన వారందరినీ దేశద్రోహులుగా పరిగణించే తరమికోట్టాలని, చంపేయాలని బీజేపి సహా ప్రధాని కూడా పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై వ్యంగ్యస్త్రాలు సందించిన మోడీపై  శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సబ్బుకూడా లేకుండా ‘నురగలు’ తెప్పించారంటూ విమర్శించారు.

‘‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెయిన్ కోటు వేసుకుని స్నానం చేసేందుకు కనీసం నీళ్లనయినా ఉపయోగించారు. మీరు (మోదీ) దేశంలోని అందరికీ స్నానం చేయించేందుకు కనీసం నీళ్లు కూడా వాడలేదు. సబ్బుకూడా లేకుండా నురగలు తెప్పించారు’’ అంటూ నోట్లరద్దు కారణంగా ఎదురైన ఇబ్బందులపై థాకరే తీవ్రంగా స్పందించారు. ఇకపై ప్రధాని మోదీ నోట్ల రద్దు గురించి మాట్లాడడం మానుకోవాలని ఉద్దవ్ థాకరే సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles