మాజీ ప్రధాని మన్మోహన్ పై ప్రధాని అనుచిత వ్యాఖ్యలు.. PM slams Manmohan for his 'loot' & 'plunder' comments

Pm modi takes on congress in rajya sabha says when you criticize have patience to accept criticism too

Narendra Modi, Motion of Thanks on Presidents Address, Rajya Sabha, NDA govt, BJP, Congress, Manmohan Singh, Raincoat comment, UPA rule, corruption, black money, Note ban, Demonetisation

Rajya Sabha witnessed a major chaos, when Prime Minister Narendra Modi said that only his predecessor Manmohan Singh could teach the art of taking bath with the raincoat on.

మాజీ ప్రధాని మన్మోహన్ పై ప్రధాని అనుచిత వ్యాఖ్యలు..

Posted: 02/08/2017 08:19 PM IST
Pm modi takes on congress in rajya sabha says when you criticize have patience to accept criticism too

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయని, అయినా అయనకు మాత్రం ఒకింత కూడా అవినీతి అంటలేదని, ఈ విధానాన్ని చూస్తూంటే రెయిన్ కోటు వేసుకుని, షవర్ కింద స్నానం చేసినట్టు ఉన్నాయని ఆయన వ్యంగంగా అన్నారు. తొలుత మన్మోహన్ విధానాలను ఆయన విమర్శిస్తుండగా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.

అనంతరం ఆయన ఇందిరా గాంధీపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి అభ్యంతరం వ్యక్తం చేశారు. తామెవరూ డీమోనిటైజేషన్ ను వ్యతిరేకించలేదని, దానికి అనుసరించిన విధానాన్ని తప్పుపట్టామని ఆయన తెలిపారు. గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారని ఆయన నిలదీశారు. గతంలో పలువురు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడం కాకుండా...మీరేం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనను 'తొందరెందుకు, మీరు మాట్లాడడానికి జీవిత కాలం ఉంది..తరువాత మాట్లాడండి' అంటూ ప్రధాని ఎద్దేవా చేశారు. డీమోనిటైజేషన్ సత్ఫలితాలనిస్తోందని ఆయన చెప్పారు. ఉగ్రవాదులకు నిధులు ఆగిపోయాయని ఆయన చెప్పారు. 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన తెలిపారు. బీమా యాప్ రూపొందించడంలో రూపాయి ఖర్చు లేదని ఆయన తెలిపారు.  

కాంగ్రెస్ వాకౌట్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో రాజ్యసభలో గందరగోళం రేగింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుకున్న కుంభకోణాల గురించి ప్రస్తావిస్తూ... ‘బాత్రూంలో రెయిన్ కోటు వేసుకుని స్నానం చేయడం ఎలాగో ప్రజలు మన్మోహన్ సింగ్ నుంచి నేర్చుకోవాల’ని మోదీ అన్నారు. మోదీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. 35 ఏళ్ల పాటు దేశ ఆర్థిక విధానాలపై మన్మోహన్ ప్రభావం ఉందని తర్వాత మోదీ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles