లైసెన్స్ లేకుండా తిరిగారో... ఖబడ్దార్ | Driving without licence leads to Jail.

Jail term for driving without a licence

Driving Licence, Telangana Driving Licence, Driving Licence Jail, Learning Licence Hyderabad, Telangana Driving Rules, Minor Driving Licence, Without a licence, Jail Term Driving Licence

Jail term for driving without a licence in Telangana. The Telangana state transport department expects the Centre to reduce the minimum educational qualification required for obtaining a driving licence for transport vehicles. Joint transport commissioner J. Pandurang Naik said an applicant seeking a licence to drive non-transport vehicles must be able to read and write. “For the transport driving licence, the applicant must have a minimum qualification of Class VIII,” he said. This rule is leading to many transport vehicle drivers not applying for licences, or operating vehicles with non-transport licences.

లైసెన్స్ లేకపోతే ఇక జైలు శిక్షే!

Posted: 01/31/2017 09:46 AM IST
Jail term for driving without a licence

నగరంలో ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా మైనర్లు స్వేచ్ఛగా తిరుగుతూ తరచూ ప్రాణాలు తీస్తుండటం చూస్తున్నాం. అయితే ఇకపై ఇలాంటివి జరగకుండా రవాణా శాఖ అడుగులు వేయబోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకు బండి ఎక్కిస్తే ఇక మీ పని అంతే. లెర్నింగ్ లైసెన్స్ తో వచ్చినా సరే అది చెల్లదంట. దొరికితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లో జైలు శిక్ష అనుభ‌వించి తీరాల్సిందే. హైద‌రాబాద్ న‌గ‌ర ట్రాఫిక్ పోలీసులు, న్యాయ విభాగం మ‌ధ్య జ‌రిగిన స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నారు. ట్రాఫిక్ కోర్టుల న్యాయ‌మూర్తులు, ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనివారిని గుర్తించేందుకు ఆర్టీఏ అధికారుల‌తో క‌లిసి ఆటోలు, ద్విచ‌క్ర వాహనాల‌పై ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు డీసీపీ రంగ‌నాథ్ తెలిపారు.

గ‌తేడాది చివ‌రి నాటికి న‌గ‌రంలో 50 ల‌క్ష‌ల వాహ‌నాలు రిజిస్ట‌ర్ అయితే సిటీలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌లు మాత్రం 20 ల‌క్ష‌లే. మొత్తం వాహ‌నాల్లో ద్విచ‌క్ర‌వాహ‌నాలు 45 ల‌క్ష‌లైతే ఆ త‌ర‌హా లైసెన్స్‌లు కేవ‌లం ప‌దిల‌క్ష‌లే. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా దొరికితే వందో, యాభయ్యో చేతిలో పెట్టి త‌ప్పించుకునే వారిని ప‌ట్టుకోవాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు. లైసెన్స్ లేకుండా బండి న‌డుపుతూ ప‌ట్టుబ‌డిన వారిపై కోర్టులో అభియోగ ప‌త్రాలు దాఖ‌లు చేసి జైలుకు పంపించాల‌ని నిర్ణ‌యించారు.

ఇక లెర్నింగ్ లైసెన్స్ దగ్గర పెట్టుకుని ఎవరికి వారు వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం. లెర్నింగ్‌ లైసెన్స్‌ కలిగిన వ్యక్తి తనంతట తానుగా వాహనం నడుపకూడదు. ఓ వ్యాలిడ్‌ లైసెన్స్‌ కలిగిన వారి పర్యవేక్షణలోనే నడపాలి. ద్విచక్ర వాహనమైతే లెర్నింగ్‌ లైసెన్స్‌ కలిగిన వారి వెనుక, తేలికపాటి వాహనమైతే ఆ వాహనంలో వ్యాలిడ్‌ లైసెన్స్‌ హోల్డర్‌ ఉండాల్సింది. లెర్నింగ్‌ లైసెన్స్‌ కలిగిన వారి వాహనాలకు కచ్చితంగా ‘ఎల్‌’ బోర్డ్‌ ఉండాలి. వీటిలో ఏది లేకపోయినా అది లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటంతో సమానమే అని అదికారులు తెలిపారు.

విదేశాల్లో అయితే జరిమానాలు సైతం 10 వేల నుంచి 20 వేల డాలర్లు, ఏడాది నుంచి రెండేళ్ళ వరకు జైలు శిక్షలు విధిస్తారు. భారత మోటారు వాహనాల చట్టం ప్రకారమూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతూ చిక్కిన వారికి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష విధించే ఆస్కారం ఉంది. ఈ నిర్ణ‌యం నేటి నుంచే అమ‌ల్లోకి రానుంది. దీంతో వందో, రెండొందలో చేతిలో పెట్టి తప్పించుకుందామన్న వేషాలు ఇకపై కుదరవన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Driving Licence  Telangana  Jail Term  

Other Articles