నోట్ల రద్దు సత్ఫలితాలు ఏంటీ..? నిలదీసిన నితీష్..! people needs to know results of demonetisation says Nitish Kumar

Pm should tell people about good results of demonetisation says nitish kumar

demonetisation, corruption, fake currency, currency ban, JD-U, Nitish Kumar, Congress, RJD, notebandi, black money, PM Modi

Bihar chief minister Nitish Kumar, demanded the Centre to tell people about “good results” of scrapping high value currency notes.

నోట్ల రద్దు సత్ఫలితాలు ఏంటీ..? నిలదీసిన నితీష్..!

Posted: 01/25/2017 10:44 AM IST
Pm should tell people about good results of demonetisation says nitish kumar

పాత పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. దేశ ప్రజలను కష్టపెడుతూ తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల కలిగిన సత్ఫలితాలను కూడా ప్రజలకు వివరించాలని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కేంద్రాన్ని కోరారు. ప్రధాని తరపున కేంద్ర ప్రభుత్వ పెద్దలైనా, లేక అర్ధిక శాఖ అధికారులు కానీ, అర్భీఐ అధికారులు కానీ ప్రజలకు నోట్ల రద్దు, కొత్త నోట్ల ముద్రణ వల్ల కలిగిన సత్ఫలితాలపై ప్రజలకు వివరించాల్సిన అవసరముందుని అన్నారు.

యావత్ దేశ ప్రజలు అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ నిర్ణయానికి సంయమనంతో కట్టుబడి వున్నందుకు వారి దేశానికి ఏలాంటి లాభాలు ఒనగూరాయన్న విషయాలు వారికి తెలియా్లసిన అవశ్యకత వుందన్నారు. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కార్పూరి ఠాకూర్‌ జయంతి సందర్భంగా జేడీ(యూ) ఈబీసీ విభాగం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఉద్దేశం సరైనది కాబట్టే ఆ నిర్ణయానికి మద్దతిచ్చినట్లు తెలిపారు. ప్రధాని 50 రోజుల గడువు కోరారని, ఇప్పటికి 77 రోజులు గడిచినందున నోట్ల రద్దు ప్రయోజనాలేంటో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు.

లెక్కాపత్రంలేని, దాచిన ధనం బ్యాంకు డిపాజిట్ల రూపంలో తిరిగి వ్యవస్థలోకి వస్తే నష్టమేంటని ప్రశ్నించారు. తిరిగొచ్చిన మొత్తం నగదులో నల్లధనం వాటా ఎంతో కూడా కేంద్రం వెల్లడించాలని కోరారు. నోట్ల రద్దు వల్ల పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్న అసంఘటిత రంగ కార్మికులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెద్దనోట్ల రద్దుకు మద్దతును కొనసాగించాలని, కానీ దాని అమలులో వైఫల్యాల్ని ఎత్తిచూపాలని నిర్ణయించిన జేడీయూ సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై ప్రశ్నలు వర్షం కురిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  corruption  fake currency  currency ban  JD-U  Nitish Kumar  Congress  RJD  notebandi  black money  PM Modi  

Other Articles