‘‘నకిలీ కరెన్సీ అంతా తూచ్’’ రికార్డులు లేవన్న ఆర్బీఐ RBI concedes, no records of fake currency deposited in banks

Rbi has no clue about fake currency detected post demonetization

Anil.V. Galgali, Rs 500 notes, Rs 1000 notes, demonetisation, RBI governor, Urjit patel, PM modi, right to information act, fake notes, reserve bank of india, fake currency

In a shocking revelation, RBI has responded to an RTI query saying that they have no idea how many fake notes have been collected since demonetisation.

‘‘నకిలీ కరెన్సీ అంతా తూచ్’’ రికార్డులు లేవన్న ఆర్బీఐ

Posted: 01/24/2017 03:41 PM IST
Rbi has no clue about fake currency detected post demonetization

పాత పెద్ద నోట్ల రద్దును ఎందుకు చేపడుతున్నాం అన్న విషయాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ గత ఏడాది నవంబర్ 8న దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం అంతా తూచ్.. అని అర్బీఐ అనిందా..? అంటే అవుననే సమాధానేలా వస్తున్నాయ్. అవినీతి నిర్మూలణ, నల్లధనం నిర్మూలణ, నకిలీ కరెన్సీ అంతు చూసేందుకే పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని, ఈ నిర్ణయం నేపథ్యంలో ప్రజలు 50 రోజుల పాటు దేశ హితం కోసం బాధను భరించాలని పిలుపునిచ్చారు.

అంతేకాదు.. కరెన్సీ రద్దు నేపథ్యంలో ఉగ్రవాదుల వద్దనున్న పాత నోట్లు చెల్లుబాటు కాక.. నిత్యం రావణ కాష్టంలా రగిలే కాశ్మీరంలో కూడా అల్లర్లు చల్లారాయని ప్రధాని అన్నారు. ఇక మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రితో రాజ్ నాధ్ సింగ్ తో పాటు పలువురు కేంద్రమంత్రులు కూడా ఫేక్ కరెన్సీ లేక మావోయిస్టుల కార్యకాలాపాలు కూడా దేశంలో తగ్గుముఖం పట్టాయని అన్నారు. అయితే తాజాగా భారతీయ రిజర్వు బ్యాంకు మాత్రం అసలు దేశంలో నకిలీ కరెన్సీ లేదని.. బ్యాంకుల్లో ఎంత మేరకు వచ్చిందో కూడా తెలియదని మరోమారు చెప్పడం దేశప్రజలను విస్మయానికి గురిచేస్తుంది.

పాత పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలతో అప్రతిష్టపాలైన ఆర్బీఐ తాజాగా వేసిన పిల్లిమొగ్గపై అటు అర్థిక నిపుణులు కూడా అశ్చర్యం వ్యక్తం చేశారు. నవంబర్‌ 8 తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన పాత రూ.1000, రూ.500 నోట్లలో నకిలీ కరెన్సీని గుర్తించారా? ఎంత మొత్తంలో నకిలీ కరెన్సీ బ్యాంకులకు చేరింది? అనే ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలతో దేశ ప్రజలను షాక్ కు గురిచేసింది.

సమాచార హక్కు చట్టం ద్వారా ముంబైకి చెందిన అనిల్‌ గల్గాని అనే కార్యకర్త అడిగి ప్రశ్నలకు బదులిచ్చిన ఆర్బీఐ.. బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన నకిలీ నోట్ల వివరాలు, వాటికి సంబంధించిన సమాచారమేదీ తన దగ్గర లేదని పేర్కొంది. పాతనోట్లు డిపాజిట్‌ చేసే క్రమంలో భారీగా నకిలీ కరెన్సీ బ్యాంకులకు చేరిందనే అనుమానాల నేపథ్యంలో అనిల్‌ ఆర్బీఐ నుంచి సమాచారాన్ని కోరాడు. అంతేకాదు, నోట్ల రద్దు ప్రకటనపైగానీ, దానికి సంబంధించిన ఇతర ప్రశ్నలకు గానీ సమాధానాలు చెప్పబోమని ఆర్బీఐ స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles