ఢిల్లీ హైకోర్టులో పాకిస్థానీ వృద్ధుడి పిటిషన్... ఏం కోరాడంటే... | Pakistani plea in Delhi High Court.

Pakistani national moves to delhi high court

Pakistan, Delhi High Court, Lahore resident's plea, Pakistani Delhi High Court, Delhi High Court Central, Delhi High Court orders, Delhi High Court Pakistan, Pakistani Plea in India, Pakistan prison in India

Pakistani National(85 years old) Moves To Delhi High Court After Serving A 12-Year Jail TermThe Lahore resident's plea for deportation came up for hearing before Justice A K Pathak who sought response of the Centre and the Delhi government before February 2.

ప్లీజ్.. నన్ను పాక్ కు పంపేయండి

Posted: 01/23/2017 10:28 AM IST
Pakistani national moves to delhi high court

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఓ పిటిషన్ లో వివరణ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తనను పాకిస్థాన్ పంపించేయాల్సిందిగా మహ్మద్ హనీఫ్ అనే ఓ వృద్ధుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 85 ఏళ్ల హనీఫ్ పాకిస్థాన్ జాతీయుడే. స్మగ్లింగ్ కేసులో అరెస్టయి శిక్షను అనుభవిస్తున్నాడు.

హెరాయిన్ ను అక్రమ రవాణా చేసిన కేసులో అతనికి 12 ఏళ్ల జైలు శిక్ష పండింది. గత ఏడాది ఏప్రిల్ 6న అతడి శిక్షాకాలం ముగిసింది. అయినప్పటికీ ఇంకా అతను జైల్లోనే మగ్గుతున్నాడు. తనను అన్యాయంగా ఇంకా జైల్లో నిర్బంధించారని, తనను స్వదేశానికి పంపించాలంటూ అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఏకే పతాక్ నేతృత్వంలోని బెంచ్... ఫిబ్రవరి 2వ తేదీ లోపల వివరణ ఇవ్వాలంటూ ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాల్ని ఆదేశించింది.

కాగా, అనూహ్యంగా స్నేహ హస్తం అందిస్తూ.. పొరపాటున సరిహద్దు దాటి తమ ప్రాంతంలోకి ప్రవేశించిన జవాన్‌ చందు బాబుల్‌ చౌహాన్‌ను పాక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం వాఘా సరిహద్దు వద్ద పాక్‌ సైనికాధికారులు జవాన్‌ చందును భారత అధికారులకు అప్పగించింది. భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపిన రోజే (సెప్టెంబర్‌ 29నే) చందు బార్డర్ దాటాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  Delhi High Court  Plea  

Other Articles