అడ్డుకుంటే ముద్రంలోకి దూకేస్తాం... | Protesters threat police at Marina beach.

Tension mounts at marina beach again

Jallikattu Protest, Marina Beach, Tension at Marina Beach, Jallikattu permanent solution, Marina Beach Jallikattu Protest, Protesters and Police, Tamil Nadu News, Jallikattu Ordinance, TN assembly Jallikattu

Tension Mounts at Marina Beach. Clash Between Protesters and Police. Thousands Removed From Chennai's Marina Beach.The protesters had refused to move out even after the state's ordinance as they demanded a permanent solution.

ITEMVIDEOS:జల్లికట్టు లొల్లి: బీచ్ వద్ద మళ్లీ టెన్షన్

Posted: 01/23/2017 10:01 AM IST
Tension mounts at marina beach again

నిషేధం ఎత్తేసేందుకు ఆర్టినెన్స్ తెస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. మరోవైపు సీఎం సమక్షంలో అట్టహాసంగా మొదలైన జల్లికట్టుతో ఇద్దరి ప్రాణాలు పోయాయి కూడా. అయినా చెన్నైలోని మెరీనాబీచ్ వ‌ద్ద మాత్రం ఆందోళన విరమించే ప్రసక్తే లేదని నిరసనకారులు చెబుతున్నారు. జల్లికట్టుపై ఉన్న నిషేధం శాశ్వతంగా ఎత్తివేయాలంటూ పెద్ద ఎత్తున్న యువత నినాదాలతో సాగర తీరం మారు మోగిపోతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మ‌రోమారు ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఆందోళ‌న చేస్తున్న వారితో మెరీనా బీచ్ చుట్టుపక్కల దారులన్నీ మూసుకుపోయి రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సుమారు నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనటం, పైగా రిపబ్లిక్ డే దగ్గర పడుతుండటంతో భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు రెండు రోజులుగా చెబుతున్నారు. అయినా వినకపోవటంతో లాభం లేదని పోలీసులు రంగంలోకి దిగిపోయారు. బ‌ల‌వంతంగా వారిని ఖాళీ చేయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో టియర్ గ్యాస్, స్వల్ఫ లాఠీ ఛార్జి ప్రయోగం చేయటంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

 

 

ఆ ప్రాంతం నుంచి త‌మ‌ను ఖాళీ చేయించాల‌ని చూస్తే స‌ముద్రంలో దూకుతామంటూ విద్యార్థులు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. దీంతో పోలీసులు ఏం చేయాలో తెలియ‌ని దిక్కుతోచ‌ని స్థితికి చేరుకున్నారు. జ‌ల్లిక‌ట్టుకు ఆర్డినెన్స్‌తో స‌రిపుచ్చ‌డం స‌రికాద‌ని, స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపించే వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని పేర్కొన్నారు.

విద్యార్థుల బెదిరింపుల‌తో వెన‌క్కి త‌గ్గిన ప్ర‌భుత్వం శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా వారిని అక్కడి నుంచి పంపించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై పోలీసు శాఖ‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. మరోపక్క ఆర్డినెన్స్ పై చర్చించేందుకు తమిళనాడు అసెంబ్లీ సోమవారం నుంచి ప్రత్యేకంగా సమావేశం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jallikattu  Protest  Marina Beach  Ordinance  

Other Articles