తమిళులు జల్లికట్టు.. ఆంధ్రుల హోదాకు మెట్టు.. kvp calls for collective fight for ap special status

Kvp calls for collective fight for ap special status

jallikattu protests, ap special status, kvp ramachandra rao, letter to chandra babu, congress, bjp. tdp, andhra pradesh, special package, united protest

Rajya sabha member KVP Ramachandra rao says tamilians jallikattu sets an another example for andhrites to fight collectively to attain special status for Andhra pradesh

తమిళులు జల్లికట్టు.. ఆంధ్రుల హోదాకు మెట్టు..

Posted: 01/21/2017 12:33 PM IST
Kvp calls for collective fight for ap special status

తమ సంస్కృతిలో భాగమైన ఒక క్రీడ కోసం తమిళులు సాగించిన పోరాటమే ఆంధ్రులకు మరోమారు నిదర్శనంగా నిలిచిందిని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపి రామచంద్రరావు అన్నారు. తమిళ సోదరుల జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉద్యమించాల్సిన అవశ్యకత వుందన్నారు. అటు తమిళులు జల్లికట్టు ఉద్యమానికి ఐదు రోజుల్లోనే కేంద్రం దిగివచ్చి వారి డిమాండ్లను అంగీకరిస్తూ అర్డినెన్సును జారీ చేసిందని.. ఈ పోరాటమే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అదర్శంగా నిలివాలని కోరారు.

ఆంద్రప్రదేశ్ లోని అన్ని వర్గాలు, కుల, మత, ప్రాంతాలతో పాటు రాజకీయాలకు, సినిమా, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖలందరూ కలసి కట్టుగా నవ్యాంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వం వహించి పోరాడాలని సూచించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. ప్రత్యేక హోదా సాధించలేకపోతే మనం చరిత్రహీనులుగా మిగిలిపోతామని, భవిష్యత్ తీరాలకు తీరని నష్టం చేసిన వారం అవుతామని చెప్పారు.  
 
చట్టవిరుద్ధమైన జల్లికట్టునే తమిళులు సాధించుకున్నారని, అలాంటిది ఎన్నికల ముందు పలు పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని హామీలను కూడా ఇచ్చాయిని, అధికారంలోకి వచ్చిన అవే పార్టీలు ఇప్పుడు మాటమార్చి ప్రత్యక హోదాను ప్యాకేజీతో ముడిపెట్టాయన్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా కల్పిస్తామన్న చట్టబద్ధమైన హామీని ఎందుకు సాధించుకోలేమని కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles