చెల్లెలు ఇలా చేస్తుందని రాహుల్ ఊహించి ఉండడేమో! | Priyanka Wadra not interested in Uttar Pradesh Elections.

Priyanka vadra not as chief campaigner for congress in up

Priyanka Vadra, Uttar Pradesh elections, Congress, Priyanka Vadra Rahul Gandhi, Rahul Priyanka Vadra, Congress-Samajwadi Alliance, Rahul Gandhi Akilesh Yadav, UP elections 2017, Uttar Pradesh Priyanka, UP elections Rahul gandhi, Congress Priyanka Vadra

Priyanka Vadra not intrested in Uttar Pradesh election main campaigner for Congress. besides this Congress-Samajwadi Party alliance in hurdle.

కాంగ్రెస్ కు షాకిచ్చిన సోనియా కూతురు

Posted: 01/21/2017 09:34 AM IST
Priyanka vadra not as chief campaigner for congress in up

అవును... కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూతురు పార్టీకి ఊహించని షాకిచ్చింది. సెమీఫైనల్స్ గా భావించే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంకు దూరంగా ఉండాలని ప్రియాంక వాద్రా డిసైడ్ అయ్యింది. దీంతో పార్టీ పునర్వైభవం కోసమే కాదు, పునాదులను లేపేందుకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హస్తం పార్టీకి ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది.

ఓవైపు ఎస్పీతో పొత్తుపై సంగ్ధిగ్ధం కొనసాగుతున్న దశలో ఆమె తీసుకున్న నిర్ణయంతో పార్టీ షాక్ కి గురయ్యింది. రాహుల్ పరపతి పనిచేయకపోవటంతో ఇందిరమ్మ పోలికలు ఉన్న ప్రియాంకను దించటం ద్వారా లబ్ధిపొందాలని కాంగ్రెస్ భావించింది. అయితే ప్రచారంలో పాల్గేందుకు ప్రియాంక ఆస‌క్తి చూప‌డం లేదు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి దూరంగా ఉండాల‌ని ఆమె నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది.

2012 ఎన్నిక‌ల్లో అమేథీ, రాయ‌బ‌రేలీ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రియాంక విస్తృతంగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన‌ప్ప‌టికీ కాంగ్రెస్‌కు ఆశించిన ఫ‌లితాలు రాలేదు. మొత్తం ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను కేవ‌లం రెండింటితోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఐదేళ్లు గ‌డిచినా యూపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి ఏమాత్రం మార‌క‌పోవడంతోనే ప్రియాంక ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అనారోగ్య కార‌ణాల‌తో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఎన్నిక‌ల్లో పాల్గొనే అవ‌కాశం లేక‌పోవ‌డంతో కాంగ్రెస్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మరోవైపు 2012 ఎన్నికల్లో కేవలం 28 సీట్లు గెలిచిన హస్తం పార్టీకి వంద సీట్లు కోరటం అసంబద్ధమైన డిమాండ్ అని సమాజ్ వాదీ పార్టీ భావిసత్ంోది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అధికార ప్రతినిధులు రాహుల్, అఖిలేష్ తో పదే పదే చర్చలు జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Vadra  Congress  Uttar Pradesh Elections  2017  

Other Articles