పాత పెద్దనోట్లుకు ఇక చెల్లుచీటి..! RBI denied to accept old notes left by dead man in Bhopal

As rbi declines exchange son left with dead father s stash of old notes

reserve bank of india, RBI Old notes, mastan singh maran, demonetisation, Shivcharan singh maran, bhopal

The Reserve Bank of India (RBI) has declined a man's request to accept old demonetised notes left by his dead father.

పాత పెద్దనోట్లుకు ఇక చెల్లుచీటి..!

Posted: 01/20/2017 03:57 PM IST
As rbi declines exchange son left with dead father s stash of old notes

పాత పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. అర్బీఐ అమలుపరుస్తున్న విధానాలు పలువురు దేశ ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ గతేడాది నవంబర్ ఎనమిదిన చేసిన ప్రకటనకు.. వాస్తవికంగా పలువురు ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితికి అసలు పొంతనే లేకుండా పోయింది. తన వద్దనున్న నాలుగు వేల రూపాయల పాతనోట్ల కోసం ఢిల్లీలోని అర్బీఐ కార్యాలయం ఎదుటు ఓ మహిళ తన వలువలను విప్పి.. వినూతన్న రీతిలో నిరసన తెలిపినా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

తాజాగా చనిపోయిన తన తండ్రి విడిచి వెళ్లిన పాత నోట్లను వారసులు బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్‌ చేసే ప్రయత్నాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అడ్డుకుంది. మార్చి 31 వరకు రద్దు చేసిన పాత పెద్ద నోట్లను డిఫాజిట్ చేసుకోవచ్చని ఓ వైపు కేంద్ర అర్థిక శాఖ చెబుతూనే.. మరోపక్కా తిరస్కరించడం ఏంటిన బంధువులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందుకు ఆర్బీఐ అధికారులు చెబుతున్న వివరణ మాత్రం ఢిఫరెంట్ గా వుంది. ప్రస్తుతం ఎన్ఆర్‌ఐలకు సంబంధించిన నోట్లను మాత్రమే జమ చేసుకుంటున్నామని స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌కు చెందిన శివ్‌చారన్‌ సింగ్‌ మారన్‌ (93) అనే పెద్దాయన గత ఏడాది (2016) డిసెంబర్‌ 26న తీవ్ర అనారోగ్యానికిలోనై చనిపోయాడు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు ఇటీవలె ఇల్లును శుభ్రం చేసే పనులు మొదలుపెట్టారు. పాత సామానంత బయటపడేసే క్రమంలో తండ్రి గదిలోని ఓ సొరుగులో రూ.50వేలు పాత ఐదువందల నోట్లలో లభ్యం అయ్యాయి. దీంతో ఈ నోట్లను తీసుకున్న అయన కొడుకు వాటిని డిఫాజిట్ చేయడానికి అర్బీఐ కార్యాలయానికి వెళ్లగా అధికారులు తిరస్కరించారు.

93 ఏళ్ల తండ్రి జ్ఞాపకశక్తిని కోల్పోవడం వల్లే ఆ డబ్బు వివరాలు ఎవరికీ చెప్పలేదని, కాగా ఇంటిని శుభ్రం చేస్తుండగా దోరికిన సొమ్మును డిపాజిట్ చేయడానికి వచ్చామని శివ్ ధారన్ సింగ్ మారన్ తనయుడు అర్బీఐ అధికారులకు వివరణ ఇచ్చాడు. అంతేకాదు తన తండ్రి మరణానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, అతడి ఆరోగ్యం వివరాలకు సంబంధించిన పత్రాలు చూపించారు. అయినా అధికారులు పాత నోట్లను తీసుకుని వాటిని అకౌంట్లో జమచేయడానికి నిరాకరించారు. ప్రస్తుతం ఎన్ఆర్‌ఐలకు మాత్రమే నగదు మార్పిడి చేస్తున్నామని అధికారులు చెప్పడంతో చేసేదిలేక వెనుదిరిగాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles