డీమానిటైజేషన్ పై కేంద్రమంత్రులు అలా.. మిత్రపక్షం ఇలా ministers praise demonetisation, ally calls it 'nuclear bomb' strike

Ministers praise demonetisation ally calls it nuclear bomb strike

demonetisation, note ban, new currency, shiv sena, prime minister narendra modi, modi cashless economy, udhav thackery, nuclear bomb, hiroshima, nagasaki, japan, nuclear bomb on indian economy, latest news

Union Minister MJ Akbar called demonetisation as historic move, while ally shiv sena call it as nuclear bomb strike on country

డీమానిటైజేషన్ పై కేంద్రమంత్రులు అలా.. మిత్రపక్షం ఇలా

Posted: 01/18/2017 07:25 PM IST
Ministers praise demonetisation ally calls it nuclear bomb strike

డిమోనిటైజేషన్ పై కేంద్రమంత్రులు ఒకలా స్పందిస్తే.. కేంద్రప్రభుత్వానికి మిత్రపక్షంగా వున్న శివసేన మరోలా స్పందించింది. పెద్ద నోట్ల రద్దు ఒక చారిత్రక విప్లవమని కేంద్రమంత్రులు ఎం జె అక్బర్, బండారు దత్తాత్రేయ అనగా, ఆ నిర్ణయం దేశ అర్థిక వ్యవస్థపై అణుబాంబు వేసినట్లేనని శివసేన ప్రధాని నరేంద్రమోడీని, ఆయన నిర్ణయాన్ని ఘాటుగా విమర్శించింది. జన్ ధన్ ఖాతాలతో లాభం ఏంటో ఇప్పుడు తెలిసిందన్నారు. ప్రతి పేదవాడు ఇపుడు తమ అకౌంట్స్ ద్వారా పేమెంట్ చేస్తున్నారని అక్బర్ అన్నారు.

నిరక్షరాస్యులు కూడా ఫింగర్ ప్రింట్ ద్వారానే లావాదేవీలు నడిపేంత సులువుగా డిజిటల్ ట్రాన్సక్షన్స్ అందుబాటులోకి వచ్చాయని అన్నారు. డిజిటల్ పేమెంట్ ద్వారా పారదర్శకత పెరిగి అవినీతికి ఆస్కారం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ డిమోనిటైజేషన్ ని వ్యతిరేకించడం అర్థ రహితమన్నారు. అవినీతి పరులకు కొమ్ము కాచే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇదిలా వుండగా బీజేపి మిత్రపక్షం శివసేన మాత్రం ప్రధాని మోడీ నిర్ణయంపై ఘాటుగా మండిపడింది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రెండో ప్రపంచ యుద్ద సందర్భంగా అమెరికా సేనలు జపాన్ లోని హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుల కంటే అధిక ప్రభావాన్ని దేశ అర్థిక వ్యవస్థపై చూపాయని మండిపడింది. మోదీ నిర్ణయంతో భారతీయులంతా బలయ్యారని శివసేన తమ అధికార పత్రిక సామ్నా ద్వారా విమర్శించింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత చోటు చేసుకునే పరిణామాలను రిజర్వ్ బ్యాంక్ చెప్పినప్పటికీ మోదీ వినలేదని అరోపించింది. చెవిటి, మూగ రామచిలుకలాంటి కేంద్రమంత్రులు, ఉర్జిత్ పటేల్ ను ఆర్బీఐ గవర్నర్ గా నియమించారని విమర్శించారు. మోదీ తీసుకున్న తప్పుడు నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles