హౌజ్ ప్యానల్ ఎదుట.. అర్బీఐ గవర్నర్ మౌనబాష RBI governor silence on House panel demonetisation questions

House panel criticises rbi governor for inability to answer demonetisation questions

demonetisation, new money, old money, Finance ministry officials, Urjit patel, Shaktikanth das, Parliament's standing committee

Members of the Parliamentary Standing Committee on Finance criticised Reserve Bank of India Governor Urjit Patel for his inability to answer queries related to demonetisation.

హౌజ్ ప్యానల్ ఎదుట.. అర్బీఐ గవర్నర్ మౌనబాష

Posted: 01/18/2017 07:01 PM IST
House panel criticises rbi governor for inability to answer demonetisation questions

డీమానిటైజైషన్ ప్రభావం అనంతరం ఎన్ని పాత నోట్లు వెనక్కి వచ్చాయి? ఎన్ని కొత్త కరెన్సీ నోట్లు ప్రింట్ చేశారు? అంటే అధికారులు అందరూ మౌనమే నీ బాష ఏ మూగ మనసా అంటూ పాటను అలపించారు. అదేనండీ ఒక్కరు కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానం చేప్పలేక తికమకపడ్డారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు సమాధానాలు చెప్పలేకపోయారని సమాచారం. నోట్ల రద్దు నిర్ణయంలో ఆర్బీఐ పాత్ర, నల్లధనం వసూళ్లు, విత్ డ్రా పరిమితిపై ఆంక్షలు వంటి పలు విషయాలపై అధికారులు తెల్లముఖం వేశారని తెలుస్తుంది.
 
కాంగ్రెస్ నేత వీరప్పమొయిలీ నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరైన ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు, ఆ కమిటీ అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎన్ని పాత నోట్లు వచ్చాయంటే వారి దగ్గర సమగ్ర సమాచారం లేదని, ఇక ఎన్ని కొత్త నోట్లు ప్రింట్ చేశారన్నా వారు ఏం చెప్పలేదట. అయితే చివరకి రూ.9.2 ల‌క్షల కోట్ల కొత్త క‌రెన్సీ ప్రవేశ‌పెట్టిన‌ట్లు అర్బీఐ గవర్నర్ తెలిపారు. నోట్ల ర‌ద్దు అంశం ప‌ర్యవ‌సానాల‌పై 2016 ఆరంభం నుంచే అంచ‌నాలు వేస్తున్నట్లు స్టాండింగ్ క‌మిటీకి ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించిన‌ట్లు తెలుస్తోంది.

నోట్ల ర‌ద్దు చ‌ట్టప‌ర‌మైన అంశ‌మా కాదా అన్న కోణంలో కూడా క‌మిటీ స‌భ్యులు ఉర్జిత్ ను ప్రశ్నించిన‌ట్లు తెలుస్తున్నది. ఇక ఈ శుక్రవారం కేవీ థామస్ అధినేతగా ఉన్న మరో కమిటీ పీఏసీ ముందు కూడా అర్థికశాఖ అధికారులు హాజరుకావాల్సి ఉంది. అప్పుడు కూడా ఇదే మాదిరి సమాధానం చెబితే ప్రధాని నరేంద్రమోదీకైనా సమన్లు జారీచేస్తామని ఆయన ముందస్తుగానే హెచ్చరించారు. నోట్ల రద్దు అనంతరం రిజర్వు బ్యాంకు తన స్వతంత్రను కాపాడుకోవడంలో విఫలమైందని పలు విమర్శలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles