వింత: ముస్లిం దేశంలో బురఖా బ్యాన్ | African first Islam country bans burqa over security concerns.

Morocco moves to ban the burqa

African first Islam country, Morocco, Burqa Ban, Muslim nation, radicalism, Morocco ban, Morocco burqa, Islam Country shocking decision

Morocco's Burqa Ban A strong message against the forces of radicalism from a Muslim nation.

ఇస్లాం కంట్రీ సంచలన నిర్ణయం

Posted: 01/11/2017 10:54 AM IST
Morocco moves to ban the burqa

మత సంప్రాదాయలకు విరుద్ధంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవటం, వాటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావటం, ఆపై ప్రభుత్వాలు వెనక్కి తగ్గటం తెలిసిందే. అయితే ఎవరెంత రాద్ధాంతం చేసినా, ఆందోళనలు పెల్లుబిక్కినా సరే తగ్గేది లేదంటోంది మొరాకో ప్రభుత్వం.

ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాలను నిషేధిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటి నుంచి మహిళలు బురఖాలు ధరించినా లేదా వాటిని తయారు చేసినా నేరంగా పరిగణిస్తారు. వారం రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ జారీ చేయనుంది. బందిపోట్లు బుర్ఖాలను ధరించి దోపిడీలకు, నేరాలకు పాల్పడుతున్నారని... ముఖ్యంగా ఉగ్ర చర్యలకు ఇవి ఉపయోగపడుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఓ అధికారి మీడియాకు తెలిపారు. అయితే ఈ నిర్ణయం ముమ్మాటికీ హక్కుల ఉల్లంఘేనని, దీనిపై మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయిస్తామని ప్రతిపక్షం చెబుతోంది.

కాగా, మొరాకో ఆఫ్రికా ఖండంలోనే తొలి ముస్లిం దేశం. ముస్లింల విస్తరణ ఈ ప్రాంతంలో 7వ శతాబ్దంలో ప్రారంభమయ్యింది. క్రీ.శ.670లో మొదటిసారి గా ఇస్లాం పాలకులు ఉత్తరాఫ్రికాలోని తీర ప్రాంతాల్లో గల మైదానాన్ని ఆక్రమించుకున్నారు. అరబ్బులు వారితో పాటుగా వారి సంప్రదాయాల్ని, సంస్కృతులను, ఇస్లాం మతాన్ని తీసుకొని వచ్చారు. దానితో ఈ ప్రాంతంలో ఉండే బెర్బర్ జాతీయులు ఎక్కువ మంది ముస్లింలుగా మారారు. యూరోప్ కంట్రీలు కొన్ని బుర్ఖాను చేసినప్పటికీ పరిమిత ప్రాంతాల్లోనే కావటం విశేషం. కానీ, మొరాకో మాత్రం పూర్తి స్థాయిలో నిషేధించటం ఇక్కడ చెప్పుకోదగిన విషయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Islam Country  Morocco  Burqa Ban  

Other Articles