Obama closes book on presidency

Barack Obama, Obama Farewell Address, Donald Trump press meet, Trump first press meet, Barack Obama last day, Obama last press meet, Defense of Democracy, Obama Closes Book on Presidency, Chicago farewell speech, Donald Trump first press meet

Barack Obama Uses Farewell Address to Call For Defense of Democracy Against Donald Trump.

బరాక్ ఒబామా డౌన్... డొనాల్డ్ ట్రంప్ ఇన్

Posted: 01/11/2017 10:13 AM IST
Obama closes book on presidency

అగ్రరాజ్యం అధ్యక్ష పదవికి తొలి నల్ల జాతీయుడు బరాక్ ఒబామా తన చివరి ప్రసంగంలో ఉద్వేగానికి లోనయ్యాడు. విశ్వాసం అంటే ఏంటో తాను చికాగో ప్రజల నుంచి నేర్చుకున్నాన్న ఆయన, ప్రతిరోజు మీ నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటేనే ఉన్నానని, దేశ ప్రజలందరూ కలిసి తనను బెట్టర్ ప్రెసిడెంట్‌గా, ఉత్తమ వ్యక్తిగా చేశారని ఒబామా వ్యాఖ్యానించాడు.

'మన దేశాన్ని ప్రత్యేకంగా నిలుపుకునే సామర్థ్యం మనకు ఉంది. ప్రజల మద్ధతు వల్లే అధ్యక్షుడిని కాగలిగాను. గత కొన్నేళ్లుగా నన్ను, మిషెల్లీ ఒబామాను ఎంతగానో ఆదరించారు. అందుకు మీకు మరోసారి ధన్యావాదాలు తెలియజేసుకుంటున్నాను. గత పదేళ్లలో దేశంలో ప్రజాస్వామ్యం ఎంతో మెరుగుపడింది. సామాన్య ప్రజలు స్పందించినప్పుడే మార్పు అనేది సాధ్యపడుతుంది. అందరూ కలిసికట్టుగా ఇదే తీరుగా భవిష్యత్తులోనూ పోరాటం సాగించాలి' అని ఒబామా పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే జాతి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని, వివాదాస్పద అంశాల జోలికి పోకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలంటూ పరోక్షంగా ట్రంప్ కి సలహాలు ఇచ్చాడు కూడా.

కాగా, రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ఒబామాకు వీడ్కోలు ప్రసంగానికి డెమొక్రటిక్ పార్టీ నేతలు, ఇతర కీలక నేతలు, అధికారులు హాజరయ్యారు. మరోవైపు ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.


ట్రంప్ ఫస్ట్ ప్రెస్ మీట్..
అమెరికా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేయనున్న ఒబామా, జాతిని ఉద్దేశించి చివరిగా ప్రసంగించిన మరుసటి రోజే కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి మీడియా సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఇంతవరకూ మీడియాతో మాట్లాడని ట్రంప్, నేడు ప్రెస్ బ్రీఫింగ్ ఇవ్వనున్నారని ప్రకటన వెలువడింది. తన వ్యాపార నిర్వహణ బదిలీ, దేశ భవిష్యత్తుపై తన నిర్ణయాలు ఎలా ఉంటాయి? అమెరికా వృద్ధి కొనసాగేలా తన పాలన ఎలా సాగుతుందన్న విషయమై ఆయన మాట్లాడతారని వైట్ హౌస్ కు కాబోయే ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసెర్ వెల్లడించారు.

కాగా, ట్రంప్ తొలి సమావేశం కోసం దేశ ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. నవంబర్ లో ఎన్నికలు ముగిసిన తరువాత ఆనవాయితీగా వచ్చే మీడియా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను సైతం ట్రంప్ నిర్వహించలేదన్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ చేపట్టిన ర్యాలీల్లో మాట్లాడినా, జర్నలిస్టులతో పెద్దగా కలవలేదు ట్రంప్. ఇక ఒబామా చివరి ప్రసంగం ముగియగానే, ట్రంప్ నుంచి మీడియాకు ఆహ్వానం రావడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Obama  Chicago farewell  Donald Trump  

Other Articles

 • Tamil nadu cm to inaugurate jallikattu celebrations in alanganallur

  తమిళనాడులో అధికారిక జల్లికట్టుకు ముహూర్తం కుదిరింది..

  Jan 21 | తమిళనాడులో అధికారికంగా జల్లికట్టు క్రీడను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందుకోసం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మైసూరుకు చేరువలో వున్న తమ రాష్ట్రం అళంగనలూర్లో ఈ ఆటను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన ఇవాళే... Read more

 • Educated women consenting to pre marital sex cannot allege rape in every case bombay high court

  ప్రియుడు చేతిలో మోసపోతే అత్యాచారం కాదు

  Jan 21 | అత్యాచారం వేరు.. ప్రియుడి చేతిలో మోసపోవడం వేరు అంటూ బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా చదువుకున్న యువతులు ప్రేమాంధకారంలో తమ సర్వస్వం ప్రియుడికి అర్పించి.. అతను పెళ్లి చేసుకోనని చెప్పగానే వారిపై... Read more

 • Bengaluru woman blackmails boyfriend with nude photos

  నగ్న ఫోటోలతో ప్రియుడ్ని బాక్ల్ మెయిల్ చేసిన యువతి

  Jan 21 | ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు ఏనాడో చెప్పారు. అయితే డబ్బే పరమావధిగా భావించి ఏకంగా ప్రియుడ్నే బ్లాక్ మెయిల్ చేసింది ఓ యువతి. బెంగళూరులో వెలుగుచూసిన ఈ ఘటనలో అమెకు పోలీసులు... Read more

 • Ghost attack in hyderabad hotel

  ITEMVIDEOS:హైదరాబాద్ హోటల్ లో దెయ్యం కలకలం

  Jan 21 | వాస్తవం సంగతి పక్కనపెట్టి ప్రస్తుతం హైదరాబాద్ లో వెలుగుచూసిన ఓ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఓ హోటల్ లో దెయ్యం అందులో బస చేసిన వారిపై దాడి చేసిందన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది.... Read more

 • Mulayam singh s aide ambika chaudhary joins mayawati s bahujan samaj party

  ములాయం సింగ్ కు జలక్ ఇచ్చిన ముఖ్య అనుచరుడు

  Jan 21 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో దేశప్రజలందరి దృష్టి అతిపెద్దదైన ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై వున్న తరుణంలో.. అక్కడి అధికార పార్టీకి మాత్రం గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno