పాత బస్తీలో ప్రైవేట్ జూ... ఇంటర్నేషనల్ మాఫియా హస్తం? | Rare 'Caracal' wild cats being smuggled

Hyderabadi held for smuggling wildcats in uttar pradesh

Hyderabad private zoo, Caracal Hyderabad, Caracal cat smuggling,Hyderabad private zoo, Hyderabad animal smuggling, Private zoo in old city, private zoo Hyderabad, animal smuggling in India

Uttar Pradesh cops rescue rare cat species from smugglers belongs to Hyderabad. .

హైదరాబాద్ లో రెండో జూ! ఎక్కడుందంటే...

Posted: 01/11/2017 08:27 AM IST
Hyderabadi held for smuggling wildcats in uttar pradesh

అదేంటీ భాగ్యనగంరలో నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ ఒక్కటే కదా! అంద‌రికీ తెలిసింది. ఇదేక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా? ఏంలేదండీ ఓల్డ్ సిటీలో ఈ మధ్యే కొందరు కొత్తగా దీనిని ఓపెన్ చేశారు. వాస్తవంలోకి వెళ్లితే... దానిని సింపుల్ గా స్మగ్లింగ్ అంటారంతే... ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ప‌ట్టుబ‌డిన ఓ ముఠా ఇచ్చిన స‌మాచారంతో అట‌వీశాఖ అధికారులు పెద్ద షాకే తగిలింది. అంతేందుకు వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయడానికి వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో(డబ్ల్యూసీసీబీ) రంగంలోకి దిగిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి.

తెర వెనక భాగోతం... 
ఇదేం అఫీషియల్ గా జంతువులను ప్రదర్శించేది కాదు. కానీ, అక్కడి పరిస్థితులు మాత్రం మినీ జూను తలపిస్తున్నాయి. అరుదైన‌, అంత‌రించిపోతున్న క‌ర‌క‌ల్‌, లెపార్డ్ జాతుల‌కు చెందిన పిల్ల‌ల‌ను ప‌ట్టి తెచ్చేందుకు హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని కాలాప‌త్త‌ర్ ప్రాంతానికి చెందిన మ‌హ్మ‌ద్ అరీఫ్ మ‌రో న‌లుగురితో క‌లిసి కొన్ని రోజుల క్రితం బీహార్ వెళ్లాడు. అక్క‌డ ఈ జాతుల‌కు చెందిన ఐదు పిల్లులను ప‌ట్టుకున్నారు. ఇనుప బోనులో వాటిని భ‌ద్ర‌ప‌రిచి సోమ‌వారం వారు తిరిగి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మీదుగా హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా ఆ రాష్ట్ర అట‌వీ అధికారుల‌కు చిక్కారు. మీర్జాపూర్ స‌మీపంలో వీరిని అడ్డుకున్న పోలీసులు త‌నిఖీ చేయ‌గా వారి వాహ‌నంలో క‌ర‌క‌ల్‌, లెపార్డ్ జాతుల‌కు చెందిన ఐదు పిల్లులు ప‌ట్టుబ‌డ్డాయి. అరిఫ్ స‌హా మ‌రో ఇద్ద‌రిని అధికారులు ప‌ట్టుకోగా, మిగిలిన వారు తప్పించుకున్నారు.

అధికారుల‌కు ప‌ట్టుబ‌డిన నిందితులు తొలుత తాము హైద‌రాబాద్ జూ సిబ్బందిమంటూ త‌ప్పించుకోజూసినా ప‌త్రాలు చూపించ‌మ‌నేస‌రికి వారి అస‌లు రంగు బ‌య‌టప‌డింది. పాత‌బ‌స్తీలో అన‌ధికారికంగా కొన‌సాగుతున్న జూలో పెంచుకునేందుకే వీటిని త‌ర‌లిస్తున్న‌ట్టు నిందితులు అంగీక‌రించారు. అంత‌రించి పోయాయ‌ని భావిస్తున్న త‌రుణంలో ఈ జాతి పిల్లులు దొర‌క‌డం ఆనందంగా ఉంద‌ని, నిందితులు వీటిని ఎలా, ఎక్క‌డ ప‌ట్టుకున్నార‌నే దానిపై ఆరా తీస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు.

వ‌న్య‌ప్రాణుల అక్ర‌మ ర‌వాణా వెనుక అంత‌ర్జాతీయ ముఠా హస్తం ఉంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ప‌ట్టుకున్న వ‌న్య‌ప్రాణుల‌ను తొలుత హైద‌రాబాద్‌, బెంగ‌ళూరులోని ఫామ్‌హౌస్‌ల‌లో కొంత‌కాలం పెంచి త‌ర్వాత వాటిని విదేశాల‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్టు భావిస్తున్నారు. నిందితులు ప‌ట్టుకున్న క‌ర‌కల్ క్యాట్స్ అనే జీవులు అసలు దేశ‌ం మొత్తం మీదే సుమారు 200 వరకు ఉన్న‌ట్టు అంచ‌నా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Animal Smuggling  Private zoo  old city  arrest  

Other Articles