అదృశ్యమైన నటి.. అంతలోనే అనుమానాస్పద మృతి Kannada actress found dead at film shooting location

Kannada actress found dead at film shooting location

padmavathi dies, junior artiste, Bengaluru Rural district, Avalahalli, masti gudi, nanda kishore, v ravichandran, rockline venkatesh, kannada film, sandalwood

Padmavati (44), a junior artiste, was shooting for the movie VIP when she fell to her death from the 18th floor of an under-construction building at Avalahalli, near Rajanukunte in Bengaluru

అదృశ్యమైన నటి.. అంతలోనే అనుమానాస్పద మృతి

Posted: 01/10/2017 06:57 PM IST
Kannada actress found dead at film shooting location

ఇది నిజంగా మిస్టరీని తలపించే ఘటన. సస్పెన్స్ చిత్రాల మాదిరిగా ఓ నటి అదృశ్యం కావడం.. తర్వాత శవంగా మారడం అంతా మిస్టరీగానే వుంది. సాయంత్రం వరకు తమతో వున్న నటి అనూహ్యంగా మృత్యువాత పడటం చిత్ర యూనిట్ లో విషాదాన్ని నింపింది. షూటింగ్‌లో భాగంగా సాయంత్రం 5:30 వరకు తమతో పాటే వున్న నటి షూటింగ్ ముగిసేటప్పటికి కనిపించలేదు. వెంటనే అలెర్టయిన చిత్ర బృందం ఆమె కోసం చుట్టు పక్కల అంతా గాలించరు. చివరికి నిర్మాణంలో ఓ భవనంలో ఆవిడ మృతదేహం కనిపించింది.

దనుష్ తమిళ చిత్రం ‘వీఐపీ’కి రీమేక్‌గా కన్నడలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యలహంకలో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో సోమవారం దాదాపు 120 మందితో చిత్రీకరణ జరుగుతోంది. ఆ చిత్రంలో నటిస్తున్న పద్మావతి అనే జూనియర్ ఆర్టిస్టు ఒక్క సారిగా షూటింగ్ స్పాట్‌లో నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కంగారు పడిన చిత్ర బృందం, ఆమె కోసం వెతకగా నిర్మాణంలో ఉన్న భవనంలో ఆవిడ మృతదేహం దొరికింది. ఇదిలా ఉండగా పద్మావతి కనిపించడంలేదనే ఫిర్యాదు తమకు రాత్రి 9 గంటలకు వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆవిడ స్నేహితురాలు కూడా పద్మ 3 గంటల నుంచే కనిపించడంలేదని వివరణ ఇచ్చింది. దీంతో పద్మావతి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : padmavathi  junior artiste  Avalahalli  masti gudi  nanda kishore  kannada film  sandalwood  

Other Articles

Today on Telugu Wishesh