కెప్టెన్ గా చివరి మ్యాచ్లో దుమ్మురేపిన ధోని MS Dhoni bulldozes to 68 in last innings as India captain

Fans on their feet as msd fires in last game as india captain

England, England vs India A, India A, India A vs England, MS Dhoni, Yuvraj Singh, ambati rayudu, Brabourne stadium, pratise match, cricket

MS Dhoni blazed away to an unbeaten 68 off just 40 deliveries against England in the first warm-up match at the Brabourne stadium.

కెప్టెన్ గా చివరి మ్యాచ్లో దుమ్మురేపిన ధోని

Posted: 01/10/2017 06:05 PM IST
Fans on their feet as msd fires in last game as india captain

కెప్టెన్‌గా తన చిట్టచివరి మ్యాచ్లో మహేంద్ర సింగ్‌ ధోనీ దుమ్మురేపాడు. ఇంగ్లండ్‌ లెవెన్‌తో ముంబైలో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ది బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ అన్న బిరుదును సార్థకం చేసుకున్నాడు. మునుపటి ధోనీని గుర్తుకు తెస్తూ బ్యాట్‌తో రెచ్చిపోయాడు. ధోని క్రీజులో వుండి మైదానంలోని నలుదిశలా షాట్లు కోడుతూవుంటే.. ధోని అభిమానులు మాత్రం స్టేడియంలో పెద్దపెట్టున ఈలలు, కేకలు, అరుపులతో హల్ చల్ చేశారు. అమ అభిమాన క్రికెటర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని సంతోషంలో మునిగితేలారు.

ఇక మరోవైపు టీమిండియా జాతీయ జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ తో పాటు అంబటి రాయుడు కూడా ప్రాక్టీసు మ్యాచ్ లో తమ సత్తాను చాటుకున్నారు. కొంతకాలంగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు శతకం బాది సత్తా చాటుకున్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న యాభై ఓవర్ల డే అండ్ నైట్ వార్మప్ మ్యాచ్లో రాయుడు శతకం సాధించాడు. అలాగే మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.

రాయుడు  97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు.  శిఖర్ ధవన్ (63), యువరాజ్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్‌ సెంచరీలు చేశారు. రాయుడు నిలకడగా రాణించగా.. ధోనీ, యువీ దూకుడుగా ఆడి అభిమానుల్ని అలరించారు. బెస్ట్‌ మ్యాచ్‌ ఫినిషర్‌గా పేరున్న ధోనీ.. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత సత్తాచాటాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు జాక్‌ బాల్‌, డేవిడ్‌ విల్లీ రెండేసి వికెట్లు తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Man kills snake found on commuter train in indonesia

  ITEMVIDEOS: సోషల్ మీడియాలో హీరోగా మారిన యువకుడు.

  Nov 23 | ధైర్యే సాహసే లక్ష్మీ అన్నారు పెద్దలు. అ సామెతను బాగా వంటపట్టించుకున్న యువకుడు ఏకంగా రద్దీ ఉండే ఓ రైల్లో ప్రయాణికుల హాహాకారాల మధ్య తన ధైర్యాన్ని ప్రదర్శించి సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.... Read more

 • Assam health minister hemanta biswas sharma controversial statement on cancer

  క్యాన్సర్ పై మూడవిశ్వాసాలు ప్రబలేలా మంత్రి వ్యాఖ్యలు

  Nov 23 | ఆయనో ఓ రాష్ట్రానికి మంత్రి.. అమాత్యుని బాధ్యతలు నెరవేస్తున్న ఈయన గారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయని మరోమారు వాదిస్తున్నారు. ఎంతలా అంటే ప్రజల్లో మూడనమ్మకాలపై మరింత విశ్వాసం పెంచెలా..? తప్పు చేస్తే శిక్ష తప్పదు... Read more

 • Eps ops faction wins back aiadmk s two leaves symbol

  శశికళకు షాక్.. అధికారంలోని ఆ ఇద్దరే ఇక పార్టీకి రెండాకులు..

  Nov 23 | తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత శరవేగంగా మారిన రాజకీయ పరిణామాలకు.. ప్రస్తుతం స్థబ్దుగా వున్నాయి. అమ్మ తరువాత చిన్నమేనంటూ జనంలో ముద్ర వేసేందుకు ప్రయత్నించిన శశికళ వర్గానికి షాకుల మీద షాకులు... Read more

 • Hyderabad metro rail smart card bookings to begin at raheja mind space

  మెట్రో స్మార్ట్ కార్డు ఇదే.. ఐటీ హాబ్లో తొలి కౌంటర్..

  Nov 23 | హైదరాబాదీయుల స్వప్నం సాకారమవుతున్న వేళ.. మరికొన్ని గంట్లలో మెట్రో రైలులో ప్రారంభానికి సన్నాహాలు సర్వం సిద్దమైన క్రమంలో ఎప్పుడెప్పుడు ప్రయాణం చేద్దామా అంటూ ఎదురుచూస్తున్న ప్రయాణికుల కోసం మెట్రో రైలు కూడా ఇందుకు సంబంధించిన... Read more

 • Violence breaks out at sathyabama university after student s suicide

  విద్యార్థిని బలవన్మరణం.. యూనివర్సిటీలో విధ్వంసం

  Nov 23 | చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు విధ్వంసానికి పాల్పడ్డారు. తెలుగు విద్యార్థులతో పాటు చెన్నైకి చెందిన విద్యార్థులకు కూడా ఈ పెను విధ్వంసం సృష్టించారు. యూనివర్షిటీలోని లెక్చరర్ల వేధింపులకు నిరసనగా విద్యార్థులు ఈ హింసాత్మక... Read more

Today on Telugu Wishesh