హైదరాబాద్ రోడ్లపై అమ్మాయిలతోనూ బీ కేర్ ఫుల్ intoxicated lady rash driving in hyderabad

Intoxicated lady creates ruckus with rash driving in hyderabad

intoxicated lady driver, drunk and drive, lady rash driving, liquor, hyderabad police, banjara hills police station, police check point, bba student, crime news

intoxicated lady driver creates ruckus in banjara hills police station limits, as she tries to escape from police check point

ITEMVIDEOS: హైదరాబాద్ రోడ్లపై అమ్మాయిలతోనూ బీ కేర్ ఫుల్

Posted: 01/10/2017 11:03 AM IST
Intoxicated lady creates ruckus with rash driving in hyderabad

హైదరాబాద్ నగర రోడ్లపై బీ కేర్ పుల్. రాష్ డ్రైవింగ్ చేసే జాబితాలో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చోటు సంపాదించారు. అదేంటి అంటారా..? మద్యం మద్తులో జోగుతూ అబ్బాయిలకు పోటీగా మేము వున్నాం అని చాటుతున్నారు. ఆ మధ్య ఓ యువతి రాష్ డ్రైవింగ్ చేస్తూ మెట్రో కోసం తవ్విన గొతిలో వేగంగా కారు నడుపుతూ పడిపోగా, అ తరువాత అనేక ఘటనల్లో అమ్మాయిలు ఇలా అడ్డంగా దోరికిపోయారు. కొందరు పీకల వరకు తాగి మధ్యం మత్తులో కారు డ్రైవింగ్ చేయగా, మరికోందరు మరో విధంగా రాష్ డ్రైవింగ్ చేసి దొరికిపోయారు. అయితే వీరు కూడా మద్యం ప్రభావానికి లోనైనట్లు పోలీసులు గుర్తించారు.

తాజాగా చదవుకుంటున్న ఓ యువతి కూడా మద్యం మత్తులో జోగుతూ నగర రోడ్లపై వీరంగం చేసిన ఘటన క్రితం రోజు రాత్రి సంభవించింది. బంజారాహిల్స్‌లో సోమవారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా..అక్కడి వరకు చేరుకున్న యువతి దానిని పసిగట్టి.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవాలని ప్రయత్నించింది. అంతే అనుకున్నదే తడవుగా వెనక వస్తున్న వాహనదారులను పట్టించుకోకుండా కారును వెనక్కి నడుపుతూ ఓ బైక్, కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కొందరు స్వల్పంగా గాయపడ్డట్లు సమాచారం.

యువతి కేర్ లెస్ డ్రైవింగ్‌తో  ఇతర వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మరికొందరు వాహనదారులు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించిగా వారిని నానా దుర్భాషలాడుతూ రెచ్చిపోయింది. వాహనదారుల సహాయంతో ఎట్టకేలకు పోలీసులు ఆ యువతిని, ఆ సమయంలో కారులో ఉన్న ఆమె స్నేహితురాలిని ఎల్వీ ప్రసాద్ ల్యాబ్స్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ యువతి ప్రైవేట్ యూనివర్సిటీలో బీబీఏ చదువుతోందని వారి విచారణలో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles