బీజేపి ప్రధాన కార్యాలయంపై టీఎంసీ కార్యకర్తల దాడి.. TMC MP arrested by CBI in chit fund scam case

Tmc mp arrested by cbi in chit fund scam case

mp tapas pal, rose valley, rose valley scam, Sudip arrested, Sudip Bandyopadhyay, Sudip Bandyopadhyay arrested, Tapas Pal, trinamool congress, Trinamool MP arrested

Trinamool Congress Lok Sabha MP Sudip Bandyopadhyay was arrested by the CBI for his alleged involvement in Rs 60,000 Cr Rose Valley group chit fund scam.

బీజేపి ప్రధాన కార్యాలయంపై టీఎంసీ కార్యకర్తల దాడి..

Posted: 01/03/2017 06:14 PM IST
Tmc mp arrested by cbi in chit fund scam case

పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర, రాష్ట్రల్లో అధికారంలో వున్న పార్టీల మధ్య రాజకీయాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను సీబీఐ అరెస్టు చేయడంతో ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు. రోజ్‌వ్యాలీ కుంభకోణంలో టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఐదు రోజుల వ్యవధిలో టీఎంసీ ఎంపీ తపస్‌ పాల్‌ను ఇదే కుంభకోణంలో అరెస్టు చేసి సీబీఐ తరువాత సుదీప్ బదోపాధ్యయను కూడా అరెస్టు చేసింది.

ఈ అరెస్టులపై టీఎంసీ విద్యార్థి విభాగం తీవ్ర అగ్రహంతో మండిపోయింది. అరెస్టులకు నిరసనగా ఆందోళనకు దిగింది. కోల్‌కతాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై ఆ పార్టీ శ్రేణులు దాడి చేశాయి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో వారిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనతో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

రోజ్‌ వాలీ చిట్‌ ఫండ్‌ కుంభకోణంలో టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ్‌ను సీబీఐ అధికారులు ఇవాళ అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇటీవల సమన్లు జారీ చేసిన సీబీఐ ఈ రోజు సుదీప్‌ను విచారించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. రోజ్‌ వ్యాలీ కంపెనీలో తపస్‌ పాల్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. 17 వేల కోట్ల రూపాయల మేరకు వేలాది మందిని మోసం చేసినట్టు రోజ్‌ వ్యాలీపై ఆరోపణలు వచ్చాయి.

తృణముల్ నేతలందర్నీ జైల్లో పెట్టినా.. నోట్లరద్దు అగదు

తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలను వారం వ్యవధిలో సీబీఐ అరెస్ట్‌ చేయడంపై ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పెద్ద నోట్లను రద్దును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ప్రధాని నరేంద్ర మోదీ సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఎంపీలు సుదీప్‌ బందోపాధ్యాయ్‌, తపస్‌ పాల్‌లను సీబీఐ అరెస్ట్‌ చేయడాన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆమె అభివర్ణించారు. 'మోదీకి ఛాలెంజ్‌ చేస్తున్నా, మా పార్టీ నేతలను అరెస్ట్‌ చేయిస్తే పారిపోతారని మీరు భావిస్తున్నారేమో, మేం భయపడేది లేదు' అని మమత అన్నారు.

పార్టీ ఎంపీలను అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ కోల్‌కతాలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని మమత చెప్పారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రిజర్వ్ బ్యాంకు కార్యాలయం ఎదుట ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిరసన తెలియజేస్తామన్నారు. అలాగే 10 రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపడతామని తెలిపారు. ఈ విషయంలో తాను చట్టబద్ధమైన పోరాటం చేస్తానని, న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తానని ఆమె అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, అసోం, జార్ఖండ్‌, పంజాబ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కోట్లాది మంది చిన్న పెట్టుబడిదారులను మోసం చేసి రూ. 17వేల కోట్ల కుంభకోణానికి రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్‌ సంస్థ పాల్పడిందని, ఈ వ్యవహారంలో అధికార టీఎంసీ నేతల ప్రమేయం కూడా ఉందని సీబీఐ పేర్కొంటున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles