చెక్కులతో చెడుగుడు అడేస్తానంటే.. అరదండాలే.... Govt plans harsher law in cheque bouncing cases

Govt plans harsher law in cheque bouncing cases

cheque bouncing, demonetisation, cashless economy, narendra modi, cheque, banks, cheque bouncing, cashless india, PM Modi, Arun Jaitley, RBI, ministry of financial affairs

To clear the path for moving towards a cashless economy, the Modi government is examining a proposal that could lead to harsher punishments for defaulters in cheque bouncing cases.

చెక్కులతో చెడుగుడు అడేస్తానంటే.. అరదండాలే..

Posted: 12/31/2016 12:14 PM IST
Govt plans harsher law in cheque bouncing cases

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తరువాత కేంద్రం ఏకంగా భారత్ అర్థిక వ్యవస్థను నగదు రహితంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో దేశంలోని అనేకమందిని.. ముఖ్యంగా వ్యాపారస్థులను వేదిస్తున్న ప్రశ్నకు కూడా సమాధానాన్ని వెతికే పనిలో పడింది కేంద్రం. అదేంటంటారా..? మనవాళ్లు ఎదుటివాళ్లను ఏడిపించి అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా బడాయిలకు పోతారే.. అదే. ఇప్పటికే మున్సిఫ్ కోర్టులు మొదలుకుని జిల్లా కోర్టుల వరకు చివరకు హైకోర్టులు వరకు కూడా ఈ తరహా కేసులు వందలు, వేల సంఖ్యలోనే వున్నాయి. అదే చెక్ బౌన్స్ కేసులు.

చెక్ వుంటే చాలు చెడుగుడు అడేస్తా.. అంలూ డైలాగులు కొట్టడంతో పాటు ఎదుటివారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించి.. ఏళ్ల పాటు కాలయాపన చేయిండం.. చివరకు న్యాయస్థానాలు తీర్పు చెప్పే తరుణంలో రాజీ కుదర్చుకుంటామని చెప్పడం ఈ మధ్య ఫ్యాషన్ గా మారింది. అయితే అలాంటి వారి ఆటలు ఇక సాగవ్. చెడుగుడు అడేస్తానంటే అరదండాలే అంతకన్నా ముందుగా వచ్చి పడతాయి. ఎందుకంటే 'చెక్ బౌన్స్' విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.

క్యాష్ లెస్ ఎకానమీ దిశగా ఇండియాను పయనింపజేస్తున్న తరుణంలో ఇచ్చిన చెక్కు చెల్లకుంటే, జైలు శిక్షను ఖాయం చేస్తూ, చట్టాన్ని సవరించాలని మోదీ సర్కారు భావిస్తోంది. ఇందుకోసం 1881 నెగోష్యబుల్ ఇన్స్టూమెంట్స్ యాక్ట్ లోని  సెక్షన్ 138ను సవరించనున్నారు. దీని ప్రకారం చెక్కు బౌన్స్ అయిన నెల రోజుల్లోగా రాజీ కుదుర్చుకోని పక్షంలో శిక్ష ఖరారు చేయాలన్నది మోదీ ప్రభుత్వం తేనుకురానున్న చట్టంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త చట్టం తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cheque bouncing  demonetisation  cashless economy  narendra modi  

Other Articles