నగదు విత్ డ్రాలపై కొనసాగనున్న అంక్షలు.. Banks want cash curbs to stay beyond 30 Dec

You might still have a cash withdrawal limit in banks after 30 dec

Arundhati Bhattacharya-SBI chairperson, Cash crunch, Cash withdrawals, Currency, Demonetisation, IBA, Indian Banks Association, RBI, union government, ordinance, old notes, demonetisation, narendra modi, pm modi, arun jaitley

Banks have asked the government to extend the curbs on cash withdrawal beyond the deadline of 30 December as there is not enough currency notes in the system yet to meet the demand from customers.

నగదు విత్ డ్రాలపై కొనసాగనున్న అంక్షలు..

Posted: 12/28/2016 08:19 PM IST
You might still have a cash withdrawal limit in banks after 30 dec

దేశం నుంచి అవినీతి, నల్లధనం పారద్రోలేందుకు కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు చారిత్రక నిర్ణయానికి.. ఈ ప్రకటన నేపథ్యంలో ప్రజలు 50 రోజులు వేచి చూడాలన్న ప్రధాని విధించిన గడవుకు ఇవాళ్టితో పూర్తైంది. ఈ తరుణంలో కనీసం కొత్త ఏడాది తొలి రోజు నుంచైనా తమ డబ్బులు విత్ డ్రాపై కేంద్రం విధించే అంక్షల్లో కొంతైనా సడలింపు వస్తుందా..? అని అశగా ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు మాత్రం బ్యాంకులు నిరాశ మిగిల్చేలా చేస్తున్నాయి.

పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం నగదు కొరత ఏర్పడ‌డంతో దేశ వ్యాప్తంగా బ్యాంకుల్లో న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌పై ప‌రిమితులు విధించి ఏటీయంలలో కేవలం రోజుకు రెండు వేల రూపాయలు, బ్యాంకుల ద్వారా వారానికి 24 వేల రూపాయల వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునేలా అంక్షలను అమల్లోకి తీసుకువచ్చింది కేంద్రం. కొత్త నోట్ల ముద్రణ నేపథ్యంలో అవి ముద్రించిన తరువాత నేరుగా బ్యాంకులు తరలించినా.. ప్రజలకు అవసరమైన సంఖ్యలో ఇవ్వలేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి.

అప్పటికే దేశ ప్రజలు రోజుల తరబడి బ్యాంకులు, ఏటీయంల వద్ద క్యూ లైన్లలో నిలబడి అనేక అవస్థలు పడ్డారు. అయితే ప్రధాని చెప్పిన గడువు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికైన తమ కష్టాలు తీరుతాయని అశించినా.. అవి తీరవని బ్యాంకులు అధికారులు చెబుతున్నారు. ఈ నెల‌ 30 తర్వాత కూడా నగదు విత్ డ్రాలపై అంక్షలను కొనసాగించాలని బ్యాంకులు కోరుతున్నాయి. ఈ మేరకు బ్యాంకులు కేంద్ర ఆర్థిక శాఖకు ఓ ప్రతిపాదనను కూడా పంపాయి.

విత్ డ్రాలపై అంక్షలను ఎత్తివేసిన క్రమంలో తాము ఇబ్బందులకు గురవుతామని బ్యాంకులు కేంద్ర ఆర్థిక శాఖకు తేల్చిచెప్పారు. తమ బ్యాంకులలో ఇప్పటికీ నగదు కోరత వుందని, ఇప్పుడే అంక్షలను ఎత్తివేసినా.. కనీసం సడలింపులు ఇచ్చినా తాము తమ కస్టమర్లకు సమాధానం చెప్పే పరిస్థితి కూడా వుండదని బ్యాంకులు తేల్చిచెప్పాయి. తమ వద్ద కొత్త నోట్లు పూర్తిస్థాయిలో అందిన త‌రువాతే ప‌రిమితులు ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles